అనుదిన ఆధ్యాత్మికత: బాధ్యత మరియు కనికరము
లేఖనము : ద్వితీయోపదేశకాండము 21:1-9;లూకా 10:25-37.
దేవుడు గందరగోళ పరిస్థితుల్లో కూడా న్యాయం కొరకు ఎలా ఆలోచిస్తారని ఎప్పుడైనా మీరు ఆలోచించారా?
ద్వితీయోపదేశకాండము 21:1-9 లో తెలియని ఒక శవమును గూర్చి ఒక కథ వున్నది ఒక వ్యక్తి చంపబడి పొలములో దొరికెను, అది ఎవరు చేసారన్నది ఎవరికీ తెలియదు. సమాజము యెక్క
బాధ్యత : చనిపోయిన వారిని గౌరవించుట, నిర్దోషులు నిందింపబడకుండా చూచుకొనుట మరియు దోషులను గుర్తించుట. ఇది కేవలము ఆచారము కాదు. అది దేవుని ద్వారా చెప్పబడినది. “న్యాయము ముఖ్యమైనది, అది సౌకర్యంగా లేనప్పటికీ, ఆ వ్యక్తి తన కొరకు తాను చెప్పుకో లేనప్పటికీ.
కొన్ని సంవత్సరాల తరువాత యేసు క్రీస్తు ఇదే ఆలోచనను మంచి సమరయుడు అను ఉపమానము ద్వారా జీవమునకు తెచ్చెను.
సమరేయుడు ఎవరో వస్తారనో లేక ఆ వ్యక్తి సహయం ఆడుగుతాడనో వేచియుండలేదు. ఆయన అవసరమును చూచి, ముందుకు అడుగు వేసి దైర్యముతోను మరియు కరుణతోను వ్యవహరించెను. యేసు క్రీస్తు తెలియజేయునది ఏమనగా బాధ్యత కేవలం మన స్నేహితుల పట్ల మరియు మనము అర్థము చేసుకొనే ప్రజల పట్లే కాక- అది అపరిచితుల కొరకు, పట్టించుకొనేవారు లేని వారి కొరకు, అణచివేయబడినవారి కొరకు కూడా వుండవలెను.
మరియు ఈ దినాలలో కూడా ఈ పిలుపు అవస్యమై యున్నది. మన చుట్టూ, అన్ని చోట్లా బాధలు వేదనలు వున్నాయి- హింస, అవమానం, పేదరికం, నిర్లక్ష్యం. యేసు క్రీస్తు వాటిని చూస్తున్నారు. ఆయన హృదయం బద్దలవుతోంది. కనుక మనకు వేయబడిన ప్రశ్న : ఆ బాధ్యత స్వీకరించుటకు మనము అంగీకరిస్తున్నామా? మనము ఆయన వేదనను వినగలుగుతున్నామా? మరియు దాని గూర్చి ఏమైనా చేస్తున్నామా? విశ్వాసము అనేది కేవలము మన నమ్మకమును గూర్చి కాదు – అది నైతిక దైర్యము, విచారించుటకు మరియు గుర్తించుటకు అంగీకారము మరియు తమను రక్షించుకోలేని వారి కొరకు వ్యవహరించడము.
నేటి పరివర్తన : మీ జీవితములో ఎవరైనా, లేక సంఘములో, సమాజములో ఎవరైనా బాధలతో వున్నవారు, సహయము అవసరమైన వారు లేక నిర్లక్షింపబడిన వారు వున్నారా? కనికరము తోను మరియు న్యాయముగా వారి కొరకు ఎలాంటి అగుడు నీవు ముందుకు వేయగలవు, కనీసం చిన్న విధానాలలోనైనా?
ప్రార్ధన : మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తున్నాము. మాకు అదృశ్యమైన వాటిని చూచె కన్నులను మరియు అంగీకారముతో ఆచరించే హృదయమును దయచేయుము. న్యాయము మరియు కనికరము ను గూర్చిన మీ వేదనకు స్పందించుటకు మాకు సహయము చేయుము. ఇతరులతో విడిచిపెట్టబడిన చోట అణచివేయబడిన వారికి సహయము చేయుటకు మాకు సహయము చేయుము. రాజులకు రాజైన యేసుక్రీస్తు అద్వితీయ నామములో వేడుకొనుచున్నాము ఆమెన్.
ముగింపు: నిజమైన విశ్వాసము మునలను బాధ్యతలకు మరియు క్రియలకు ప్రేరేపిస్తుంది. ద్వితియోపదేశకాండము లో ఆ తెలియని శవము పట్ల వ్యవహరించిన రీతి మరియు గాయపడిన వ్యక్తి పట్ల సమరయుని సహయము విధముగా నిర్లక్షింపబడినవారి బాధ్యత మనపై వుంది. ప్రతి దినము ఆయన న్యాయము మరియు కనికరము ద్వారా చూచి, వ్యవహరించి, జీవించవలెనని దేవుడు పిలుచుచున్నాడు.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన- రచయిత రెవరెండ్. ఇమ్మానువేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున . ప్రచురణ 18. అక్టోబరు. 2025. తర్జుమ: సహోదరి . జలజాక్షి. అన్ని వాక్యములు ప్రశ్నలు రికవరి వర్షన్ ఆప్ ద బయిబుల్. (లివింగ్ స్టీమ్ మినిస్ట్రీస్)).
ప్రకటనలు :
1. మీ ఈమెయిల్ కు మా ఆధ్యాత్మిక రచనలు క్రమముగా రావాలని ఆశించినట్లు అయితే దయచేసి మా యెక్క ప్రశ్నాపత్రం నింపవలెను. రచనలు ఆంగ్లములో, తమిళములో మరియు తెలుగులో ప్రచురింపబడుచున్నవి. అవి మీ ఈమెయిల్ కు వస్తాయి.
2. మీ శిషత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే.. మా వారాంతపు శిషత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం. ప్రతి శనివారం జరుగును.link: https://us06web.zoom.us/j/ 81144235750? pwd=EsfuED6du4T8YMjFdSXdpvWuPXpCOW.1 (໖໖ ໑໕: 81144235750. ລ້ລ້: 12345)
3. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము ఆశిస్తున్నాము.
Click here to Download as PDF -> Telugu