అనుదిన ధ్యానము : విమోచన కొరకు ఆత్మ యొక్క స్వస్థత

Posted on October 28, 2025

Home Publications Posts అనుదిన ధ్యానము : విమోచన కొరకు ఆత్మ యొక్క స్వస్థత

అనుదిన ధ్యానము : విమోచన కొరకు ఆత్మ యొక్క స్వస్థత

అనుదిన ధ్యానము : విమోచన కొరకు ఆత్మ యొక్క స్వస్థత.

లేఖన ద్యానము: కీర్తనలు 41:4.

మన జీవితములో అనేక సార్లు అర్థంకాని పరిస్థితులు, ఏం చేయాలో తెలియని సమయాలు, ఎలా అధిగమించాలో తెలియని పరిస్థితులను ఎదుర్కుంటాము. మనం ప్రతీ విషయాన్ని ఎలా ముగించాలి, ఎలా పరిష్కరించాలి మరియు తరువాత దిసకు ఎలా చేరాలి అని ముందుకు వెలుతుంటాము. తమకు ఎదురయ్యే ప్రతి స్థితికి జవాబులు వెతికే రీతిలో మనుషులు రూపింపబడ్డారు. అది చిన్న విషయాలు : వంట, ఉద్యోగం, చదువు, ఇంటి సామాన్లు కొనడం వంటివి లేక ప్రాముఖ్యమైనవి వివాహ సంబంధమైనవి, అనారోగ్యం, ఆర్థిక విషయాలు కావచ్చు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ మన ఏకైక ద్యాస దానిని అంచన వేయడం, పరిసీలించడం, జవాబులు వెతకటం, మరియు దానిని పరిష్కరించడం. మనం ఈ ద్యాసతోనే ప్రార్థనలు కూడా చేస్తుంటాం, జవాబులు, విడుదల రావాలని – మనము బాహ్యం సంబంధమైన జవాబులను వెతుకుతుంటాం కాని అది అంతరంగానికి సంబందించిన జవాబు అయితే? మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యెద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యెద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి”. ప్రభువైన దేవుడు మన భారములను మరియు బాధలను మన ఆత్మల తో ఎందుకు అనుసంధానము చేస్తున్నారు? మన ఆత్మ యెక్క విశ్రాంతి మన బాహ్య సమస్యలకు ఏలాగున జవాబు?

ఆత్మ అంటే ఏంటి? ఆధ్యాత్మిక నియమముతో మనుషులు రూపింపబడుట, లేక ఆధ్యాత్మికత, లేక నైతిక ప్రభావము, లేక మమషుల యొక్క నైతిక మరియు భావోద్వేగ స్వభావము మనలో రూపింపబడిన ఆధ్యాత్మిక, నైతిక మరియు భావోద్వేగ నియమములు మన ఆత్మ. ఇది భౌతికం ను మించినది. ఇది శారీరక సంబంధము కానిది మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చేది. అలా అయితే, మనం మన ఆత్మ పట్ల ఎంత వరకు శ్రద్ధ చూపిస్తున్నాం? ఆత్మ మన ప్రేమకు, ఆశలకు, బావోద్వేగమునకు, వాంచకు, నైతిక, నియమాలకు, వైఖరికి, స్వభావమునకు ఆసనమైయున్నది. మన ఆత్మ-అయితే దేవునితో సంబంధం కలిగి వుంటుంది లేక దేవునికి వ్యతిరేకముగా వుంటుంది.

మన పాపములు మన ఆత్మలో ఉద్భవిస్తాయి. మన ఆత్మ మన స్వభావము. స్వభావము అనగా- వ్యక్తిగత మానసిక మరియు నైతిక లక్షణాలు. దేవుడు మన జీవితాలు ఎంత ఖచ్చితముగా వున్నాయన్నదాని కన్నా మన స్వభావము ఎలా వుందని పర్యవే క్షిస్తుంటారు. తద్వారా మన ఆత్మలకు స్వస్థత కలగాలని ఆయన ఆశిస్తున్నారు. దానినే ఆయన విమోచనగా పరిగణిస్తున్నారు. కీర్తనలు 41:4 “యెహోవా నీ దృష్టి యెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను”. దేవుడు ఉద్దేశపూర్వకముగా ప్రతీ అడ్డంకులను మన జీవితాలలో వుంచుతారు. మన త్రోవలో ఎదుర్కొనే ప్రతీ సవాళ్లకు ఆయనకు ప్రత్యేక చిత్తము కలదు.

మన పరిస్థితులను మన ఆత్మలో గల బలహీనతలను మరియు లోటుపాట్లను తెలియజేస్తారు. మనము అకౌంటెంట్ అవ్వలంటే మనము 12వ తరగతిలో మేత్స మరియు అకౌంట్స్ తీసుకోవాలి. అదే విధముగా, దేవుడు మన స్వభావములో వృద్దిని చూడాలనుకున్నపుడు లేక మన ఆత్మలో ఏదైనా పాపము ను చూపించుటకు మన జీవితములో ఏదో ఒక పరిస్థితిని కలుగ జేస్తారు. మనము ఆయనకు అప్పజెప్పుకొని తర్పీదు పొందుతామన్న ఆశతో. బదులుగా మనం పరిస్థితులను చూచి వాటిని వద్దు అనుకుంటాము, ఎందుకంటే అది దేవునిలో మన స్వభావము రూపింపబడుతుందనే ప్రక్రియ అని చూడకపోవడం వలన. మన ఆత్మ స్వస్థత పొందకుండా మనం దేవునిని ఎలాగు చూస్తాము?

పరివర్తన : నా జీవితములో నా ప్రాముఖ్యత ద్యాస ఏంటి? నేను నా స్వభావమునకు శరీరము కంటే విలువను ఇస్తున్నానా?..’ నా ఆత్మ స్వస్థత కై నేను శ్రమపడుటకు ఇష్టపడుతున్నానా? లేక దాని స్వస్థతను తిరస్కరించి సమస్యలు పోవాలని ఆశిస్తున్నానా?

ప్రార్ధన : మా పరలోకపు తండ్రి, మాకు కనిపించని మా భాగమైన మాఆత్మను బట్టి అజ్ఞానులమై వున్నాము. మేము మా స్వభావము పై ప్రేమ, నైతికత, మానసిక, ఆశలు, భావోద్వేగాలు మరియు వైఖరి పట్ల సరియైన దృష్టిని ఉంచ లేకున్నాము. మా జీవితాలు సజావుగా సాగాలని ఎక్కువ ఆశక్తి కలిగి వున్నాము, అది ఎలాగైనా పొందాలని తాపత్రయ పడుతున్నాము. మా ఆత్మలు మీతో కలవాలన్న మీ ఆశను మేము మర్చిపోయాము. కనుక అది స్వస్థత పొందుకొనవలెను. మీరు మా ఆత్మను స్వస్థపరచని యెడల మేము మీ పిల్లలము కాలేము . మా అంతరంగ స్వస్థత నిర్లక్షించి మేము పాపము చేసి యున్నాము . ప్రభువా మమ్మును క్షమించి, మా ఆత్మ యెక్క స్వస్థత వేడుకొనుటకు అనుదినము కనికరముతో జ్ఞాపకము చేయుము.

సందేశం : మన ఆత్మను సరిచేయుట దేవుని ప్రాముఖ్యత అయి వున్నది. భ్రష్టుపట్టిన ఆత్మ దేవునితో అనుసంధానము కాలేదు. కనుక నిజమైన విమోచన మన ఆత్మీయ స్వస్థతై వున్నది. జీవితములో ప్రతి స్థితికి కారణం దాగి యున్న సమస్య. మనకు ఎప్పుడైనా దుమ్ము విరిగితే వైద్యుని దగ్గరకు వెళ్ళాం కాబట్టి వెంటనే ఆ రోజే స్వస్థత జరిగిపోవాలి అనుకోము. ఆయన వ్రాసిన పరీక్షలు చేయించి, నెలల కొద్ది ఆమన ఇచ్చే వైద్యాన్ని కొనసాగిస్తాము- ఆ విరిగిన దుమ్ము స్వస్థతకై. నొప్పి మరియు వాపు- లోపల దుమ్ము విరిగిందనుటకు సూచనలై వున్నవి. మనము నొప్పికి, వాపుకి వైద్యము చేయము గాని విరిగిన దుమ్ము కి వైద్యం చేస్తాము. అలాగే మన జీవితము లో సమస్యలను పరిష్కరించాలనుకొనే బదులుగా, మనము మన పరమ వైద్యుని దగ్గరకు వెళ్ళి, నిజమైన విమోచనకై మన అంతరంగ స్వభావ స్వస్థత కై మనలను ఆయనకు అప్పజెప్పు కొనవలెను.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత సహోదరి. జసింత ఏంజెల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ. అక్టోబర్. 2025, తర్జుమ: సహోదరి.జలజాక్షి.)

ప్రకటనలు:

1. మీ శిష్యత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే మా వారాంతపు శిష్యత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం – ప్రతి శనివారం జరుగును. ఉదయం 6 గంటలకు.

zoom link:https://us06web.zoom.us/j/81144235750? pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3E vQT09.(meeting id:81144235750.passcode:12345)

2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము –ఆశిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మా సమా చారములకై  https://chat.whatsapp.com/FQuH58GtkEEApPCm9gN8no వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు :https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment.

Click Here to Download as PDF -> Telugu