విధానమును విశ్వసించుట : దేవుని వాగ్దానములో లంగరు వేయబడిన ఆలోచనావిధానము.
యేసు క్రీస్తు నామములో వందనములు:
జీవితములో విడుదల పట్ల ద్యాస కలిగి వుండుట సులభతరం కానీ ఈ విధానములో దేవుని మహిమను కోల్పోతాము.
మనము తక్షణ జవాబులు, విడుదల కొరకు కనిపెట్టు కొనుట వలన దేవుడు మన హృదయ అంతరంగాల లోతులలో ఆయన జరిగించు క్రియలను చూడలేని గుడ్డితనము కలుగును.
యిర్మియా 29:11 పలుమార్లు ప్రోత్సహించుటకు చెప్పబడినది కాని దాని అమరికను గుర్తు చేసుకున్నపుడు దాని సముృద్ధి అయిన అర్ధం తెలుస్తుంది.
ఇశ్రాయేలు ప్రజలు గృహములకు దూరముగా, నిరుత్సాహముతో, విడుదలకు అతృత కలిగినవారై బబులోనులో బందీలుగా వుండిరి . ఇద్దరు ప్రవక్తలు
వారితో మాట్లాడిరి : హనన్య తక్షణ విడుదల వాగ్దానము చేసెను, యిర్మియా దేవుని నిజ వాక్కు ను నమ్మకముతో పంచుకొనెను, ఈ ప్రవాసము డెబ్బది సంవత్సరములు వుండును కొద్ది కాలం కాదు అని, హనన్య మాటలు అబద్దపు ఆశలను రేసెను, కాని యిర్మియా సందేశం, వినుటకు కష్టతరమైనప్పటికీ, తన ప్రజలపట్ల దేవుని హృదయమును వెల్లడించెను.
యిర్మియా ద్వారా దేవుడు ప్రకటించెను: నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణ కలుగునట్లగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హనికరమైనవి కావు (యిర్మియా 29:11). వారు వేచియుండుటలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరల ఆయన సాన్నిధ్యములో సంతోపించుటకు, వారి గుర్తింపును కనుగొనుటకు, వారిని స్వస్థత మరియు సిద్ధపాటు కాలము ద్వారా ఆయన సరియైన దిశను చూపెను.
ఇది ప్రవాసమును ఓర్చుకోనుట మాత్రముకాదు- ఇది దేవుని సమయమును గూర్చి నేర్చుకొనుట లేక తెలుసుకొనుట. ఆయనను నమ్ముటకు లేక విశ్వసించుటకు విధేయతకు మించినది అవసరము అది నూతనపరచబడిన ఆలోచనావిదానమై యున్నది. మన భావోద్వేగాలు మారవచ్చు, మన పరిస్థితులు కష్టతరము లేక భారము కావచ్చు మరియు నిరీక్షణ లేనట్టు వుండవచ్చు, కానీ దేవుని వాగ్ధానములు స్థిరముగా వుండును.. వేచియుండుట తృణీకరింపబడినట్లు కాదు గాని, అది దేవుడు పరిస్థితుల వెనుక చేస్తున్న పనిని ఇప్పటికి చూడలేని పరిస్థితి.
మీ పురోగతి వెంటనే కలుగకపోవచ్చు, కానీ అది దేవుని సరియైన సమయములో వస్తుంది. ఆమన వాక్కు వలన మీ హృదయము నూతనపరచబడుట ద్వారా, మీరు ఆయన నిర్ణయించిన భవిష్యత్తు మరియు నిరీక్షణలో నడుచుటకు సన్నద్ధులగుదురు. కాగా మీరు మీ వైపల్యాలను, బలహీనతలను, అసంధవ పరిస్థితులను చూడక, బదులుగా క్రీస్తును చూడుడి. ఆయన రక్తము గొప్ప వాక్కును పలుకును మరియు ఆయన వాగ్దానములు ఎప్పటికీ తప్పవు.
( అనుదిన ఆధ్యాత్మిక పరివర్తని. రచయిల్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్, ముద్రణ ఆగస్టు 2025 అనువాదం సహోదరి జలజాకి).
Click to download as PDF -> Telugu