శీర్షిక:సువార్త వలన కలుగు విస్తారమైన /సమృద్ధియైన సంతోషమును పంచుకొనుట
సువార్త కేవలం సమాచారము కాదు గానీ అది జీవితాన్ని మార్చేది. అది కేవలం భోదించేది గా కాక మనలను విమోచించి, మన ప్రభువును మరియు రక్షకుడైన యేసు క్రీస్తునకు దగ్గర చేసేది.
యెహను 4:28-30 లో సమరయ స్త్రీ గూర్చి ఆలోచిద్దాం, యేసు క్రీస్తును కలిసిన తరువాత ఆమె ఆజ్ఞల కొరకో లేక ఆలోచన కొరకో వేచియుండలేదు. ఆమె అనుభవాన్ని పంచుకొనుటకు పరుగెత్తెను. ఆమె సంతోషము వ్యాప్తించేది! ఈ విధముగా సువార్త పనిచేస్తుంది- అది పంచుకొనవలసినది, మనలో ఉంచుకొనుటకు కాదు.
ఆమె ప్రతిస్పందనను గమనిద్దాం : ఆమె నైపుణ్యతను మరియు ప్రణాళికలను అభివృద్ధి చేసుకొనలేదు/ నేర్చుకో లేదు. ఇతరులను ఒప్పింపజేయుటకు ఆమె చింతించలేదు- అది సృష్టికర్త యెక్క పని, ఆమె సులభముగా ప్రతిస్పందించింది- విశ్వసముపై ఆనుకొనుట.మనము సువార్తను పొందుకున్నప్పుడు అది మనలను రక్షించుటయే కాక మనలను అంతరంగము నుండి బాహ్యమునకు రూపాంతరము కలిగిస్తుంది, మన వ్యక్తిత్వములో క్రీస్తును ప్రతిబింబిస్తుంది.
యేసు క్రీస్తు యెహను 4:14 చెప్పునదేమనగా, విశ్వాసులలో జీవజల ఊటలు ఊరును ఆ జలములు ఉబికి పొంగి పారవలసినవై యున్నవి. ఆ ప్రవాహమును అడ్డుకున్నట్లయితే అది చెడిపోవును, మనకే తిరిగి హాని కలుగును. అది చెడిన నీటి బుగ్గ అవుతుంది, జల ప్రవాహములను ఆపినట్లు అవుతుంది.
లోతును గూర్చి ఆలోచిద్దాం- ఆయన అభ్రహము మీద దేవుని ఆశీర్వాదమును చూచెను కానీ సాదోమోలో మౌనముగా వుండెను. ఆయన మాట్లాడుటలో విఫలమవుట వలన మూల్యముగా ఆయనకు కలిగినదంతా కోల్పోయెన. అదే విధముగా ప్రభువు మనకు అనుగ్రహించినది బిగబట్టిన యెడల దానిని కోల్పోయే ప్రమాదమును ఎంచుకొన్నట్లు.
మత్తయి 25: 14-30 లో దీనిని యేసుక్రీస్తు తేట తెల్లము చేసెను. వారికి ఇవ్వబడినది ఎవరైతే వృద్ధి చేయుదురో వారికి మరి ఎక్కువ ఇవ్వబడును. ఎవరైతే దాచియంచుదురో వారికి కలిగిన కొంచెము కూడా కోల్పోవుదురు. సువార్త లోకమునకు విలువైనదిగా కనిపించకపోవచ్చు కాని అది శక్తివంతమైనది. సమరయ స్త్రీ యెక్క సాక్ష్యము ఇతరులను క్రీస్తునొద్దకు నడిపెను మన సంతోషమును పంచుకొనుట యొక్క విలువకు ఇది నిదర్శనం.
కనుక ఇది మన హృదయమునకు తీసుకుందాం: సువార్తను స్వీకరించి, మనలను అది రూపాంతర పరచనిచ్చి, విశ్వసనీయతతో దానిని ప్రకటిద్దాం. అది మన జీవితములో వృద్ధి పొందునట్లు ప్రభువైన దేవునిని విశ్వసిద్దాం. మీ సంతోషము జీవ జలము వంటిది అది పొంగి పారవలసినదైయున్నది.
పరివర్తన: ఈ రోజు మిమ్మును మీరు ప్రశ్నించుకొనుడి. ప్రభువైన దేవుడు నాకు ఇచ్చిన సంతోషమును మరియు జీవమును వృద్ధి చెందకుండా నిరోదిస్తున్నాన? ఆయన ప్రేమను ఇతరులకు ప్రచురించుటకు నన్ను ఏది అడ్డుకుంటుంది? కొన్నిసమయాల్లో అది- భయం, స్వీయ సందేహం, లేక నేను ఇంకా సిద్ధంగా లేను అని ఆలోంచించుకోవడం. కాని సమరయ స్త్రీ మనకి గుర్తుచేయునది ఏమనగా చిన్న విశ్వాసము చాలు; మిగిలినది ప్రభువైన దేవుడు చూసుకుంటారు.
ప్రార్ధన : పరలోకపు తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు, మమ్మును బహుగా ఆశీర్వదించినప్పటికీ, తరచుగా స్వార్ధముగా ప్రవర్తిస్తూ నీ రాజ్యమునకు దారితప్పిపోతున్నాము, నా హృదయములో జీవజలములను వుంచినందుకు వందనములు..మీ సువార్త యెక్క సంతోషమును సంకోచించకుండా లేక భయపడకుండా ప్రచురించుటకు సహయము చేయుము. చిన్న సాక్ష్యము కూడా జీవితాలను తాకగలదు, రూపాంతర పరచగలదని విశ్వసించుటకు నేర్పుము,ప్రేమతో మరియు ధైర్యముతో నన్ను నింపుము నా రాజైన రక్షకుడా, మీ ఆశీర్వాదములు నా ద్వారా అనేకులకు ప్రవహించునట్లు సహాయము చేయుము. యేసుక్రీస్తు నామములో, ఆమెన్.
ముగింపు: క్రీస్తును ఎరుగుట అను సంతోషము వెలుపలికి ప్రవహింపవలసినదైయున్నది. ప్రభువైన దేవుడు మీకు అనుగ్రహించినది ప్రచురించుడి – (మీ కథ, మీ ప్రోత్సాహము, మీ ప్రేమ). పరిపూర్ణత లేక అనుమతి కొరకు వేచియుండ వద్దు. మీ హృదయమును పొంగి పొర్లనివ్వండి, దానిని దేవుడు వృద్ధి చేస్తారని విశ్వసించండి.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత, సహోదరి, జలజాక్షి, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ 9 అక్టోబర్. 2025. అన్ని వాక్యములు ప్రశ్నలు రికవరి వర్షన్ ఆప్ ద బియిబుల్ (లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ).
ప్రకటనలు:
1. మీ ఈమెయిల్ కు మా ఆధ్యాత్మిక రచనలు క్రమముగా రావాలని ఆశించినట్లు అయితే, దయచేసి మా యొక్క ప్రశ్నాపత్రం నింపవలెను. రచనలు ఆంగ్లములో, తమిళములో మరియు తెలుగులో ప్రచురింపబడుచున్నవి.అవి మీ ఈమెయిల్ కు వస్తాయి.
2) మీ శిష్యరిక ప్రయాణంలో మా సహకారం ఆశించినట్టు అయితే, మా వారాంతపు శిష్యరిక సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం. ప్రతి శనివారం జరుగును. link::https://uso6web.zoom.us/j/81144235750?pwd EsfuED6du4T8YMjFdSXdpvWupXpcow.1( meeting id:81144235750.passcode:12345).
3) వ్యక్తిగత కౌన్సిల్ కొరకు మమ్మల్ని సంప్రదించండి.. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడుచుటకు మేము ఆశిస్తున్నాము.
Click here to download as PDF ->Telugu