మతమును మించిన సంబంధము:
మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ కృప మరియు సమాధానము . ఈ అధ్యయనములు మిమ్మును నెమ్మది పరచునట్లు, ప్రతిబింబిచునట్లు మరియు ఆయనకు దగ్గర చేయునట్లు సహయపడవలెనని ప్రార్థిస్తున్నాను.
ఈ రోజులలో అనేకులు క్రైస్తవ్యాన్ని మరొక మతముగా చూస్తున్నారని మీరు ఎరుగుదురు . కాని వాస్తవానికి,అది నియమాలు, అలవాట్లు, దినచర్య మరియు స్వీయ సహయము గూర్చి కాదు గాని, క్రైస్తవ్యం క్రీస్తుతో సంబంధం గూర్చి, మన అంతరంగము సూన్యముగా వున్నప్పుడు మన వెలుపల శుద్ధీకరణకు ఆయన ఆసక్తి చూపరు. ఆయన జీవముతో మనలను నింపుటకు ఆయన ఆసిస్తున్నారు.
యిర్మియా రోజున గూర్చి ఆలోచిద్దాం, హనన్య వంటి
అబద్దపు ప్రవక్తలు ఆశీర్వాదమునకు బాహ్య శ్రేయస్సు ను కొలమానముగా ప్రమానము చేయుదురు. కానీ యిర్మియా, ప్రజలు క్రీస్తు నిజ సంకల్పములోనికి నడిపెను – హృదయములు అంతరంగములో నుండి బాహ్యము నకు రూపాంతరము పొందెను. అది ఇప్పటికీ మనకునూ నిజమై యున్నది. సువార్త మొదట మన పరిస్థితులను సరి చేయుటకు కాదు, అది యేసు క్రీస్తు నిజముగా మనలో ప్రతీ భాగమును పాలించునట్లు మన ఆలోచనలు, కోరికలు మరియు దృష్టిని పునరుద్దీకరించుట గూర్చి
దీనిని గూర్చి యేసు క్రీస్తు హెచ్చరించెను- మత్తయి 12:43-45. “అపవిత్రాత్మ ఒక మనుషుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగు చుండును. విశ్రాంతి దొరకనందున తాను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని వచ్చి, ఆ ఇంట ఎవరును లేక అది ఊడిచి అమర్చియుండుట చూచి, వెళ్ళి తనకంటే చెడ్డ వైన మరి ఏడు దయ్యములను వెంట బెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మెదటి స్థితి కంటె చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించునూ అనెను. హృదయము ఊడిచి సుభ్రపరచి ఖాలీగా వుంచిన యెడల అది శత్రువు ను మరల తిరిగి విశాలముగా తెరచి ఆహ్వానించినట్లు అవుతుంది. అని ఆయన చెప్పెను. మతము కేవలము బాహ్య ఆచారముల వరకే అయితే ఇదే జరుగుతుంది- అది ఇంటిని అలంకరించి రక్షణ లేకుండా వదిలేస్తుంది. కానీ క్రీస్తు ఎప్పుడు లోపలికి వస్తారో అప్పుడు అన్నీ మారుతాయి. ఆయన కేవలము పాతవి తీసివేయుటే కాక మనలను ఆయనతో నింపి మనలను నూతన పరచును. మరియు ఇదియే నిజమైన పశ్చాత్తాపమునకు వివరము. ఇది సులభముగా మనము ఆశించినట్లు శ్రమలు, కష్టాలలో నుండి బయట పడడానికి కాదు గానీ ఇది ప్రభువైన దేవుని స్వారూప్యము లోనికి మనలను పునరుద్దీకరించుటకు మరి ఇది ఏలాగు జరుగును? శిష్యరికము ద్వారా. ఆదిమ శిష్యులు యేసు క్రీస్తుతో ఎలాగు నడిచిరో ఆలాగున మనము కూడా సమయము ద్వారా ఆయన సాన్నిధ్యములో, దైవిక అలవాట్లలో కట్టబడుతూ, ఇతర విశ్వాసులతో
సహవాసము కలిగియుండి, ఆయన వాక్యమును వింటు మరియు ప్రతిదినము అప్పగించుకొనుట నేర్చుకొనుట. ఇది తాత్కాలికము కాదుగానీ, జీవిత కాలము నడువుట కనుక మనము ఆశీర్వాదమును డబ్బుతో, గెలుపుతో లేక సౌకర్యములతో కొలవ వద్దు. నిజమైన ఆశీర్వాదము క్రీస్తు యెక్క గుణాతిశయములు మనలో రూపింపబడుట అది ఈ లోకము ఇవ్వగలిగే దాని కన్నా ఎంతో విలువ కలిగినది.
ఈ రోజు నేను మిమ్మును ప్రోత్సహిస్తున్నాను మీ దగ్గర లేని వాటి కొరకు లేదా మీరు మారాలి అనుకునే వాటి మీద దృష్టి ఉంచకుడి. మీలో సమస్తమును నూతనముగా చేయగల వాని యందు ఆనందించుడి. ఆయనే మీ యెక్క గొప్ప నిధి.
పరివర్తన : నా జీవితములో దేని మీద ఎక్కువ దృష్టి కలిగి వున్నాను? బాహ్య మార్చా లేక అంతరంగ రూపాంతరమా? నేను నిజముగా క్రీస్తుని నన్ను నింపుటకు నన్ను పాలించుటకు అనుమతిస్తున్నానా లేక కేవలము నటిస్తున్నాన.
ప్రార్ధన : నా ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తూ, కేవలము నా బాహ్య శుద్ధీకరణ మాత్రమే కాక, నాలో నివసించుటకు మరియు నూతన పరచుటకు వచ్చినందుకు మీకు వందనములు. నేను బాహ్య లేక ఈ లోకపు విజయములలో ఆశీర్వాదమును వెతకక నాలో నీ జీవము ఎదుగునట్లు నాకు సహయము చేయుము.అనుదినము మీతో నడువుట నాకు నేర్చుము. హృదయము యొక్క ప్రతీ భాగము అప్పగించు కొనుటకు మరియు అన్నింటిని మించి మీ సాన్నిధ్యములో ఆనందించునట్లు సహయుము చేయుము ఆమెన్.
ముగింపు: నిజమైన ఆశీర్వాదము మారిన పరిస్థితులలో లేదు కానీ, అది క్రీస్తు జీవం మీలో దిన దినము రూపింపబడుట లో వున్నది. అది అంతరంగములో నుండి భాహ్యముకు.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత: రెవరెండ్. ఇమ్మానువేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ 3. అక్టోబర్ 2025, అనువాదము: సహోదరి, జలజాక్షి. అన్ని వాక్యములు ప్రశ్నలు రికవరి వర్షన్ అఫ్ ద బయిబెల్ (లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ).