అనుదిన ఆధ్యాత్మికత : “జ్ఞాపకము” చేసుకొను దేవుడు.
ధ్యానాంశము : ద్వితీయోపదేశకాండము 31:6.
“దేవుడు జ్ఞాపకము చేసుకొనెను” అను వాక్యమును గ్రంధములో తరచూ వాడుట మనం చూస్తుంటాం. నోవాహు నీటి ప్రవాహములో ఉన్నప్పుడు ఆయన నోవాహును జ్ఞాపకము చేసుకొనెను.ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ప్రలాపించి నపుడు ఆయన వారిని జ్ఞాపకము చేసుకొనెను.. రాహేలు బిడ్డ కొరకు సుదీర్ఘ కాల వేదనలో వున్నపుడు ఆయన ఆమెను జ్ఞాపకము చేసుకొనె ను. మొదటి దృష్టిలో ” జ్ఞాపకము చేసుకొనుట అనే వాక్యం” దేవుడు కొంత కాలం మరచి పోయినట్లు అనిపిస్తుంది. కాని పరిశుద్ధ గ్రంధంలో, దేవుడు జ్ఞాపకం చేసుకొనుట అంటే ఆయన నూతన కనికరం మరియు నిర్ణయపూరిత చర్యతో ఆయన ప్రజల యెద్దకు వస్తున్నట్లు అని అర్థం. ఇది ఆయన చెప్పే విధానం.” ఇప్పుడు నేను పూనుకుంటున్నాను”.
ప్రాముఖ్యమైనవాటిని మర్చిపోకుండా ఉండుటకు చాలా ప్రయాస పడుతూ ఉంటాము. కానీ పరిశుద్దాత్మ దేవుడు ఏది అవసరమో దానిని పట్టు కొని ఉండుటకు మరియు మిగిలినవి విడిచిపెట్టుటకు ఆయన విధానములో సహాయము చేయును. ఆయన మన పాత గాయాల మీద ఉన్న పట్టును, న్యాయమును గూర్చిన స్వరాలు మరియు లోతైన గాయములు చేసే జ్ఞాపకాల యొక్క పట్టును ‘సరళము చేయును. కొన్ని సమయాలలో మన పాత విషాదాలపట్ల జ్ఞాపకశక్తిని కోలుపోతున్నట్లు అనిపి స్తుంది; కాని,ఈ మరుపు ఒక వరము అవుతుంది, ఒక నిశ్శబ్ద స్వస్థత.
కానీ దేవుడు మరిచిపోతారా? పవిత్ర భావము లో-అవును . ఆయన మన పాపములను “మరిచిపోతారు”- మన పాపాల పట్ల ఆయన జ్ఞాపకం తుడచి వేయబడదు, కాని మనం చేసిన వాటిని బట్టి మనలను పరిగణించకుండా ఎంచుకొనెను. ఆయన మరుపే ఒక కృప- అది లోపము కాదు.
మరియు కొన్ని సమయాలలో విడుదల లేని వేడైన కాలాలుగా అనిపించవచ్చు .యషయా దేవుని చిత్రమును వెండి బంగారములను శుద్దీకరించువాని గా చిత్రీకరించెను.ఆ అగ్నిలో చుట్టూ ఉన్నవి కదలనట్టు అనిపిస్తుంది; ఒత్తిడి మరియు మంటలు ఉంటాయి, జీవితం ఇరుకున పడినట్టుంటుంది. ఆ సమయాలలో దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది .కానీ శుద్దీకరించువాడు లోహమును చూడకుండా విడిచిపెట్టడు. ఆయన తన దృష్టిని దాని మీదనే నిలిపియుంచును, ఆయన తన ప్రతిబింబము చూచు సమయము వరకు వేచియుండును.
ద్వితీయోపదేశకాండములో వున్న వాగ్దానము వెనుక ఉన్న ఆయన హృదయం ఇదే. “బలవంతులై దైర్యము కలిగి ఉండుడి; భయపడకుడి, వారిని గూర్చి భయబ్రాంతులు కాకుడి. నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చును; ఆయన మిమ్మును తప్పిపోనివ్వడు మిమ్మును యెడబాయడు” .ఇది జ్ఞాపకం చేయునది ఏమనగా -దేవుని గమనిక ఒక్క క్షణం కూడా తప్పిపోదు. ఆయన ఉనికి నిశ్శబ్ధముగా అనిపించవచ్చు, కానీ అది స్థిరమైనది ఆయన రూపించి మరియు మెరుగు దిద్దును మరియు ఎప్పుడైతే ఆయన స్వభావము మక జీవితం ద్వారా తిరిగి ప్రకాశిస్తుందో, శుద్దీకరణ దాని పనిని ముగించినట్లు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఆ అగ్నిలోనుండి లేవనెత్తి, ఆయన మహిమ కొరకైన పాత్రగా మిమ్మును చేయును . ఇప్పుడు అగ్ని భరించలేనిదిగా అనిపిస్తే, మీరు తృణీకరింప బడ్డారని అనుకొనవద్దు. అగ్ని అనేది తృణీకారం కాదు అది రూపాంతరం, మరియు మిమ్మును చూచువాడు ఇంకను మిమ్మును జ్ఞాపకముంచుకొని యున్నారు.
పరివర్తన:
దేవుని నిశ్శబ్ధం ఆయన లేనట్లు కాదు; కాని అది,ఎవరైతే అగ్నిని ఎప్పుడూ విడిచిపెట్టరో ఆ శుద్ధీకరించువాని స్థిరమైన దృష్టి. ఈరోజు, మీరు చూచిన, జ్ఞాపకం ఉంచుకొనిన మరియు జరిగిన వాగ్దానం పై విశ్రాంతి కలిగియుండుడి. ఆయన మీలో ఆరంభించిన పని ఆయన చిత్త ప్రకారము జరుగుతుందని విశ్వశించుడి.
ప్రార్ధన:పరలోక మందున్న మా తండ్రీ, యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తున్నాం. చూచిన వాటిని బట్టి కాక విశ్వాసముతో నడువమని మమ్మును మీరు పిలిచినప్పటికీ, అనేక సార్లు మీ యొక్క మహిమను, శక్తిని చూడలేకున్నాము. మరియు దానికి బదులుగా మేము మాయొక్క బలహీనతలు, మా పాత గాయాలు మరియు మా భయాలు మీద వాలిపోతున్నాం. శూన్యం లో నుండి సమస్తమును సృష్టించే దేవుడవని మాకు మరల భోధించుము ప్రభువా మమ్మును ఆదరించుము మరియు నీ బలమైన హస్తముతో మమ్మును స్థిర పరచుము. చీకట్లో వెలుగు వలే ప్రకాశించునటులు మాలో మీ స్వస్థత ప్రవహింపనీయుడి.యేసు క్రీస్తు నామములో ప్రార్ధించుచున్నాము ఆమెన్.
ముగింపు :
దేవుడు జ్ఞాపకం చేసుకొనుట అనేది కనికరం, చిత్తం మరియు నూతన పరచబడిన చర్యను బట్టి మన దగ్గరికి వచ్చు అయన విధానం, ఆయన మరిచిపోయినట్లు కాదు. జీవితం శుద్దీకరించే అగ్నిలా కనిపించినప్పుడు, దేవుని ఉనికి స్థిరమైనదై, ఆయన మహిమ కొరకై మనలను రూపు దిద్ది మరియు శుద్దీకరించును.మనలోని మరుపు కొన్ని సమయాలలో మన స్వస్థత కు అవసరమై ఉన్నది. మన గత వేదనలను వేరుల నుండి పెకలించి, విడుదల చేయుటకు ఇది వరమై ఉన్నది.దీనిని మనం ప్రతీసారి చూడలేనప్పటికి, దేవుని దృష్టి ఎప్పటికి మారదు, మరియు ఆయన ప్రేమ ఎప్పటికి విఫలం కాదు లేక మనలను ఎడబాయదు. మన పిలుపు ఆయన విధానం ను విశ్వాసించుటకు, అగ్ని- రూపాంతరం చెందుటకొరకు, త్రుణీకారం కాదని తెలుసుకొనుటకు.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత రెవరెండ్ ఇమ్మానువేల్ అరుల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున,4వ పచురణ నవంబర్. 2025, తర్జుమ: సహోదరి.జలజాక్షి.)
ప్రకటనలు:
1. మీ శిష్యత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే మా వారాంతపు శిష్యత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం – ప్రతి శనివారం జరుగును. ఉదయం 6 గంటలకు. Zoom Link: https://us06web.zoom.us/j/81144235750? pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3EvQT09.(meeting id:81144235750.passcode:12345)
2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము ఆశిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మా సమా చారములకై https://chat.whatsapp.com/FQuH58GtkEEApPCm9gN8no
వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు :https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment.
Click Here to Download as PDF->Telugu