అనుదిన ఆధ్యాత్మికత: మెసగాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి.

Posted on December 7, 2025

Home Publications Posts అనుదిన ఆధ్యాత్మికత: మెసగాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి.

అనుదిన ఆధ్యాత్మికత: మెసగాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి.

అనుదిన ఆధ్యాత్మికత: మెసగాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి.

కుటుంబమా, ఒక నిమిషం మీతో నిజంగా వుండవచ్చా? ఈ వారంలో ఒక సంఘటన నన్ను చాలా కుదిపివేసింది ఎవరో ఒక దొంగ ఫేస్బుక్ అకవంట్ సృష్టించి నాలా నటించి మరియు అనేకులను డబ్బులు అడిగి తీసుకున్నారు.హృదయవికారం మేంటంటే, చాలా మంది మోసపోయారు. నేను ఉదయము లేచి, నా మెసేజ్లు చూసుకున్నప్పుడు ఏం జరిగిందన్నది చూసి నా గుండె జారిపోయింది. మీకు ఆ అనుభూతి ఎలా వుంటుంది అన్నది అర్థమైందనుకుంటాను – ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకు ప్రజలు వీటికి పడిపోతున్నారు / మోసపోతున్నారు? అప్పుడు, ఒక సహోదరుడు చేసిన వ్యాఖ్య నన్ను నిజముగా ప్రార్ధన లోనికి మరియు పరివర్తనకు నేరుగా నడిపెను. ఆ సంభవములో నుండి వచ్చిన ఈ ఆధ్యాత్మికత మీతో పంచుకోదలచాను.

సత్యము ఇదియే: మోసగాళ్లు కొమ్ములతో మరియు త్రిశూలాలతో కనిపించరు. ఒకవేళ అలా వారు కనిపిస్తే మనం వెంటనే వారిని కనిపెట్టేస్తాం. కానీ శత్రువు లాగానే, వారు వెలుగు సంబందుల వలే ముసుగు కప్పుకొని వచ్చెదరు- విశ్వసనీయముగా, సరియైన వారిగా, సత్యవంతులుగా కనిపిస్తారు. గ్రంధం తెలియజేయునది ఏమనగా శత్రువు వెలుగు దూత వలె మారువేషం వేసుకొనును; నిజమైన దేవుని ప్రకాసవంతమైన వెలుగు కాదు గాని, ఒక తేలికపాటి అనుకరణ – ఏదైతే రక్షణ లేని హృదయమును మెపపరచగలదో. అయితే మనం ఎందుకు వీటికి కొన్ని సమయాల్లో పడిపోతున్నాము? మనం మూర్ఖులమని కాదు, మనం నిర్లక్ష్యంగా వున్నామని కాదు. కానీ, ఆ సమయములో మనం యేసుక్రీస్తుతో సాన్నిహిత్యం లోతుగా, స్థిరంగా, చురుకుగా లేదని అర్థం . ఇది అంతా మనం ఏదెను లో చూస్తాం. ఆదాము హవ్వ ప్రతిదినము దేవునితో సాన్నిహిత్యముగా నడువుటకు ఏదేను తోటను దేవుడు సుృష్టించెను. కానీ మోసము జ్ఞానము అనే ముసుగు వేసుకొని వచ్చినప్పుడు వారు ఆ సాన్నిహిత్యముపై ఆధారపడలేదు. వారికి సర్పము చెప్పినది ఏమనగా, “ఇది మీ జీవితాలని మెరుగు పరుస్తుంది”. పరిచయమైన మాటల్లా అనిపిస్తున్నాయా ? ప్రపంచం ఇదే మాటల్ని చెబుతూ వుంటుంది; ” ఇక్కడికి రండి – ఇది మీ జీవితాన్ని మెరుగు పరుస్తుంది. ” ఇది ప్రమత్నించి చూడండి – ఇదే మీరు కోల్పోతున్నది”. “ఇదే నిజమైన జ్ఞానం”. కానీ, యేసు క్రీస్తు దీనికి సంపూర్ణ విత్యాసమైన దారిలోనికి పిలుస్తున్నారు. ఆయన చెప్పునది ఏమనగా “మెదట మీరు దేవుని నీతిని, రాజ్యమును వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు కలుగును. తరచు, మనం మరొక కోణం లో క్రీస్తు తోని సంబంధమును ప్రయత్నిస్తుంటాం – మతసంబంధమైన క్రియలు ; కానుకలు ఇవ్వడం, దశమభాగం ఇవ్వడం, వాఖ్యం చదవడం, ఆచారాల ప్రకారము ప్రార్ధించుట, సంగమ్ యెక్క పరిచర్యల్లో సువార్త కూటాల్లో పాల్గోవడం, ఇదే దేవునితో సంబంధం అనుకుంటాం.. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఇవి మనకు భావోద్వేగ సౌకర్యమును కలిగించునట్లు మనకి కనిపిస్తాయి. నిజానికి, ఈ అలవాట్లే మోసగాళ్లకి వ్యక్తుల జీవితాలు తెలుసుకొనుటకు మార్గాలు అవుతాయి. ఈ మోసం మోసపోయినప్పుడు మాత్రమే బయటపడదు. అది లోపలికి శోధనల ద్వారా ప్రాకుతూ (శరీరం) మాంసమునకు సౌకర్యం కలిగేలా కనిపిస్తుంది ఎటువంటి వంటే నీలి చిత్రాలు చూచుట, పొగ త్రాగుట, త్రాగుడు, కోపం, పగ, నిందించుట, ఇంక అనేక రకాలైన పాడుచేసే అలవాట్లు. ఇవి విడుదల, సుఖం, తప్పించుకొనుట, లేక “ఇంకొక్కసారి” అన్నట్లు ముసుగు వేసుకొని వస్తాయి, కానీ అవి ఆత్మను సంకెళ్లు వేయుటకు మాత్రమే ఆశపడతాయి. విడుదల చేయుటకు కాదు. కుటుంబమా, ఇది నిజమైన ఆహ్వనం : మెరుగైన జీవితము కొరకు అడ్డుదారులు చూపే జ్ఞానము వైపు పరుగెత్తకుడి. యేసు క్రీస్తు వైపు పరుగెత్తుడి.పరిశుద్దాత్మకు సన్నిహితముగా వుండుడి. క్రీస్తు శరీరమైన విశ్వాసులతో కలసుకొనుటలో వేరుపారి యుండుడి. ఎందుకంటే, ఎప్పుడైతే మనం కలిసి నడుస్తామో, కలిసి ఎదుగుతామో, కలిసి ప్రార్ధిస్తామో, మరియు ఏక ఆత్మ కలిగియుంటామో, దేవుని రాజ్యము మనము కేవలము మాట్లాడుకొనేదిగా కాక దానిలో జీవించువారమగుదుము.

మరియు, మీరు మోసపోయినట్లు అయినా, గాయపడినా, లేక తప్పుతోవ పట్టినా, దయచేసి వినండి: సిగ్గుపడవద్దు, తద్వారా దేవునికి సమీపించుటకే, మిమ్మును త్రోసివేయుటకు కాదు. మనలను కొనుక్కొని మరియు రక్షిస్తున్న ఆయన సొంత రక్తము ద్వారా మనకు యేసు క్రీస్తుతో మనకు మరి లోతైన సాన్నిహిత్యముకు అవకాసము కలదు. కనుక ఆ వెలుగుకు దగ్గరగా వుందుము గాక, ఆయన నిజమైన వెలుగు నొద్ద ఉందుము గాక. తద్వారా ఎలాంటి అబద్దపు వెలుగు మనలను మరలా మోసము చేయుకుండునట్లు.

పరివర్తన : కల్వరి సిలువలో యేసు క్రీస్తు సైతాను యెక్క ప్రతీ మోసపూరితమైన పధకములను జయించి యున్నారు అని ఈరోజు నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. కానీ, విశ్వాసులైయుండి కూడా, మనం కొన్ని సమయాల్లో శత్రువు పన్నాగములో పడిపోతున్నాము. సైతాను బలవంతుడని కాదు, యేసు క్రీస్తుతో మనకు ఎడతెగని సాన్నిహిత్యం లేనందువలన. ఈ ప్రపంచం సులువైన విజయాలు, సంతోషం, జ్ఞానములను ప్రమాణము చేస్తూ మనలను శోధిస్తుంది, కానీ అవి నిజమైన సత్యము నుండి దారి మళ్ళిస్తాయి. యేసు క్రీస్తు తో సాన్నిహిత్యం కలిగి అనుదినము ఆయన సన్నిధిలో నడచినపుడు ఆయన గెలిచిన విజయములో మనం జీవిస్తాము. మరియు మోసమును కనిపెట్టగల సిద్ధపాటు ఆయన సన్నిధి అనుగ్రహిస్తుంది. కనుక మనం యేసుక్రీస్తుతో అంటుకట్టబడియుందాం; ఆయనే మన బలం, మన వెలుగు, మన ఆశ్రయదుర్గం.

ప్రార్ధన : పరలోక మందున్న తండ్రి, యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తున్నాము. మమ్మును ప్రతీ ఉచ్చులలో నుండి వలలలో నుండి రక్షించువాడవు నీవే, ప్రతీ హాని, విద్వంశం మరియు మోసములనుండి మా జీవితాలను లెక్కలేనన్నిసార్లు రక్షించినందుకు కృతజ్ఞత చెల్లించుట మరిచిపోయాము. మీరు ఎప్పుడూ మమ్మును – నడిపే వెలుగై,మా సహయకుడివై, మా రక్షకుడవై యున్నావు. రక్షణ యెక్క సంతోషము మాలో నిలిచియుండునట్లు మరియు బద్రపరచబడునట్లు మీరెక్కల క్రింద ఆశ్రయము కనుగొన్నట్లు మాకు సహయము చేయుము, మరియు మేము అర్ధం కాకుండానే ప్రార్థన చేసినా,మెలిగినా, మీ ప్రేమపూరిత దయతో మమ్మును జ్ఞాపకము చేసుకొనుము మరియు మమ్మును మీకు అప్పగించుకొనుట అంగీకరించి, మీకు దగ్గర చేసుకొనుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ఆమెన్,

సారాంశం: మోసం ఎప్పుడూ ఆకర్షనీయముగా, నమ్మసక్యముగా,వెలుగు నిండినదిగా కనిపిస్తుంది, కానీ మన హృదయాలు క్రీస్తుకి దూరముగా వున్నపుడే శత్రువు పథకాలు సాధ్యమవగలవు.యేసు క్రీస్తుతో అనుదిన సాన్నిధ్యం – ప్రార్ధన ద్వారా, వాక్యం మరియు సహవాసము ద్వారా మన వివేచన పదునవుతుంది, అది మనలను అసత్యము నుండి రక్షిస్తుంది మరియు నిజమైన వెలుగులో నడిపిస్తుంది. అడ్డదారులు లేక త్వరిత లాభ ప్రమాణములు మనలను శోధించినపుడు, ఆగి, యేసు పై ఆనుకొని, ఆయన సాన్నిధ్యంలో వేరు పారి యుండుడి.

 

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయిత. రెవరెండ్. ఇమ్మానువేల్ అరుల్ పాల్. హియర్ మేత్త్యూ 11:28 మినిస్ట్రీస్ తరుపున. ముద్రణ 6.2025)

ప్రకటనలు:

1. మీ శిష్యత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే మా వారాంతపు శిష్యత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం – ప్రతి శనివారం జరుగును. ఉదయం 6 గంటలకు. Zoom Link: https://us06web.zoom.us/j/81144235750? pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3EvQT09.(meeting id:81144235750.passcode:12345)

2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము ఆశిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మా సమా చారములకై  https://chat.whatsapp.com/FQuH58GtkEEApPCm9gN8no

వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు :https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment.