ఆధ్యాత్మిక పఠనం : క్రిస్మస్ అంటే ఇదే.
ధ్యానాంశం :
యెషయా 9:2. “ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించును.”
మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి శుభములు తెలియ జేస్తున్నాను. ఈ సందేశం క్రిస్మస్ కి కొంచెం ఆలస్యంగా చేరుతుంది కానీ క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి అనే మార్పు ఎప్పటికి ఆలస్యం కాదు. మనం చాలా సార్లు సువార్తను గురించి మాట్లాడుతూ ఉంటాం. మన రక్షకుడైన యేసు క్రీస్తు జన్మించాడని చెప్తూ ఉంటాం – ఇది నిజంగా ఒక అద్భుతమైన వార్త. కానీ కొన్ని సార్లు మనం క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్నని వొదిలేస్తుంటాం.
యేసు క్రీస్తు ఎందుకు వచ్చారు??
లేఖనాల ప్రకారం ప్రభువైన దేవుడు మనుష్యుల్ని, తెగలని, రాజ్యాలని వారి స్వంత అభివృద్ధి కోసం ఎన్నుకోలేదు గాని ప్రపంచ ఆశీర్వాదం కోసం ఎన్నుకొన్నాడు. ఎపుడైతే ఆ పిలుపు స్వార్ధంగా మారుతుందో అప్పుడది నాశననికి దారి తీస్తుంది.
యేసు క్రీస్తు జననం ఒక శుభవార్త ఎందుకంటే మనని మన పాపలు, వాటి పరిణామాలనుండి విడుదల చేస్తుంది అయన రాక . మనం దాని ఉదేశాన్ని మర్చిపోతే అసలు పండుగ జరుకోవడం వలన లాభమేంటి??? దేవుడు ఆదాము హవ్వని ఆశీర్వాదంగా ఉండడానికి సృష్టించాడు. దేవుడు అనేక జనాలను అబ్రాహాము ద్వారా ఆశీర్బదించడానికి ఎన్నుకొన్నాడు. యేసు క్రీస్తు తన వెలుగుని ప్రపంచమంతా ప్రకశింప జేయడానికి తన శిష్యులను పిలిచాడు. జెక్కయ్య సహితం యేసు క్రీస్తు ని కలిసిన తర్వాత అవస్రతలో ఉన్నవారికి సహాయం చేయడానికి తనకున్నవన్నీ ఇచ్చాడు. అప్పుడతని ఇంటిలోకి వెలుగు వచ్చింది.
సొలొమోను విషయానికోస్తే, అతను కట్టిన ఆలయం కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిశుద్ధ స్థలంగా ఉండడమే కాకుండా అది ఎంతోమంది ఆశీర్వాదం కోసం కట్టబడింది. సొలొమోను ప్రార్ధించి నపుడు అన్యులు ఆలయం వైపు తిరిగి అంగలార్చినపుడు వారి ఆర్తనాధం విని జవాబువ్వమని వేడుకొన్నాడు. ఆ విధంగా ప్రజలంతా దేవుని నామాన్ని తెలుసుకొని ఆయనకి భయపడాలన్నది ఆలయ నిర్మాణం యొక్క ముఖ్య ఉదేశ్యం. అయన ప్రజల ద్వారా జనులను ఆశీర్వాదించా లన్నదే అయన ఉదేశ్యం. కాబట్టి ఈ సంబరాల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను.
మీరు ఆశీర్వాదంగా ఉండడానికి ఎంచుకొన్నారా???
“నేను ఆశీర్వాదహించబడ్డాను అనడానికి బదులు నేను నా కుటుంబానికి, నా ఇరుగు పొరుగు వారికి, ఇతరులకి యేసు క్రీస్తు ప్రేమను చూపించే విధంగా జీవించడానికి ఎంచుకోగలరా???
మీ దయగల, ధాతృత్వంతో కూడిన , కరుణ గల క్రియల ద్వారా రక్షకుని జననం యొక్క సౌందర్యాన్ని మీ చుట్టూ వున్న ప్రజలను చూడనివ్వండి. ఎప్పుడైతే దావీదు తన అధికారాన్ని ధుర్వినియోగ పర్చి పాపం చేసాడో , ప్రభువైన దేవుడు ఆయనకు తీర్పు తీర్చాడు ఎందుకంటే వెలుగుకు బదులుగా అతను చీకటిగా మారాడు. కాని యేసు క్రీస్తు, చీకటి మరియు మరణంతో నిండిన లోకంలోకి గొప్ప రూపాంతరపు వెలుగుగా వచ్చారు.ఈ సమయంలో , అన్ని సమయాల్లో మనం కూడా ఆ వెలుగును ప్రతిభింబించాలి .
యేసు క్రీస్తు ద్వారా పొందిన నిత్య జీవాన్ని ఆశీర్వదించడంలో ప్రదర్శిద్దాం. మన సంబరాలు పాటలు మరియు అలంకరణలలో మాత్రమే ముగించకుండా, క్రియలలో, ప్రేమలో మరియు పరిచర్యలలో ఉప్పొంగనిద్దాం.ఈ రోజు యేసు క్రీస్తు యొక్క వెలుగు మీలో నుండి ప్రకాశించును గాక.
పరివర్తన : ఈ రోజు, యేసు క్రీస్తు కేవలం మనను రక్షించడాని మాత్రమే రాలేదు కాని మనను అనేకులకు ఆశీర్వాదంగా చేయడానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకొందాం. లేఖనాల ద్వారా, దేవుని యొక్క ఏర్పాటు- ఆదాము మరియు హవ్వ మెదలుకొని, అబ్రహాము వరకు, సొలోమోను ఆలయం వరకు, శిష్యుల వరకు – ఎప్పుడూ బాహ్యమైన వాటిపైన దృష్టి కలిగి, ప్రపంచంపై ఆయన వెలుగును ప్రకాశించాలనే ఉదేశ్యం కలిగినదిగా ఉంది . జక్కయ్యలాగా నిజమైన రూపాంతరం , దాతృత్వం మరియు కరుణ ద్వారా దాని కదే కనిపిస్తుంది . ఈ క్రిస్మస్ సమయంలో మనం కేవలం విశ్వాసపు మాటలు మాట్లాడడమే కాకుండా యేసు క్రీస్తు హృదయాన్ని చూపించే క్రియలుగా మార్చబడదాము . ఈ రోజు ఎవరో ఒకరు మీద్వారా ఆయన ప్రేమను అనుభవించాలి.
ప్రార్ధన : ప్రియ పరలోకపు తండ్రి , యేసు క్రీస్తు నామంలో మీ ముందుకు వస్తున్నాము; ప్రభువైన దేవా, మీ అనుగ్రహం కొరుకు, మీ కుమారుడైన యేసు క్రీస్తు కొరుకు , ఆయన వాక్కు కొరుకు మరియు పరిశుద్దాత్మ కొరుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు క్రిస్మస్ యొక్క బహుమానంకై మీకు కృతజ్ఞతలు ! అది కేవలం కేలండరులో ఒక తారీకు మాత్రమే అయినప్పటికి, అది రోజూ జ్ఞాపకం చేసుకోవలసిన సత్యమని మాకు తెలుసు. కొన్ని సమయాలలో మేము ఈ లోకపు భారాలు మరియు వేదనలలో చిక్కు కొని, మీరు కోరినట్లు సంబరాలు జరుపుకోవడం మర్చిపోతున్నామని ఒప్పుకొంటున్నాము.ఈ సమయంలో మేము ఆగి క్రిస్మస్ ఎందుకు ? అన్నది ప్రశ్నించుకొని పరివర్తన చెందడానికి అని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఆశీర్వదకరంగా ఉండేటట్లు సహాయం చేయండి.చెడు మార్గాలనుండి మమ్మల్ని విమోచించండి మరియు మమ్మల్ని మీ రాజ్యం కోసం ఫలభరితంగా చేయండి. ఎల్లప్పుడూ మీ వెలుగు మాలోనుండి ప్రకాశించును గాక. యేసు క్రీస్తు నామములో ప్రార్దిస్తున్నాము, ఆమెన్.
సందేశం : ఈ లోకంలోకి వెలుగు మరియు రక్షణ తేవాలనే ఉదేశ్యంతో యేసుక్రీస్తు వచ్చారు. దేవుడు ఎప్పుడు తన ప్రజలను ఆశీర్వదంగా ఉండడానికి ఎన్నుకొన్నారు కానీ కేవలం ఆశీర్వాదాలు పొందు కోవడానికి మాత్రమే కాదు. సొలొమోను ఆలయం లాగా మన జీవితాలు ఇతరులను దేవుని దగ్గరకి తీసుకు రావాలి. నిజమైన సంబరాలు ఆచారాలకు మించి క్రియలుగా మారాలి. ప్రతీ దినం ప్రేమ, దయ మరియు కరుణ ద్వారా క్రీస్తును చూపిద్దాం.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయిత. రెవరెండ్. ఇమ్మానువేల్ అరుల్ పాల్. హియర్ మేత్త్యూ 11:28 మినిస్ట్రీస్ తరుపున. ముద్రణ డిసెంబర్. 27.2025.తర్జుమా సహోదరి:జలజాక్షి).
ప్రకటనలు :
1.మీ శిశత్వపు ప్రయాణములో సహకారము కోరినట్లు అయితే ప్రతీ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు జరిగే మా శిష్యత్వపు సమావేశమునకు మిమ్మును ఆహ్వానిస్తున్నాము..
Link:https://us06web.zoom.us/j/81144235750pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3 EvQTo9 (meeting id: 81144235750) (passcode: 12345).
2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కోరినట్లు అయితే, అపాయింట్మెంట్ కొరకు ఈ లింక్ ను వాడండి.https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment
3. మా మినిస్ట్రీస్ మరియు సమావేశాలు యెక్క సమాచారం తెలుసు కొనుటకు https://chat.whatsapp.com/EokMFGuZdgb23Sg8 బషజాస్
4.మీరు మా ఆర్టికల్స్ ఇకమీదట తరచు పొందుకొనుటకు ఆశించినట్లు అయితే మీ పేరు మరియు ఇమెయిల్ ఐడి ని పంపించండి. దీనిని ఉద్దేశించి మేము ఒక ప్రశ్న పత్రమును పూరించుటకు తయారుచేసం.అది నింపి పంపినట్లు అయితే మీకు ఆరు నెలల సబ్స్క్రయిప్షన్ ప్లాన్ లో ఉంచబడతారు. మీకు కావలిసిన భాష ను ఎంచుకోవచ్చు-తమిళ్, తెలుగు, ఆంగ్లము. ఆ భాషలో మీకు ముద్రణలు పంపబాతాయి. అన్ని బాషలను కూడా ఎంచుకోవచ్చు. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి నూతనీకరిస్తాం.
ప్రశ్న పత్రం తొందర్లో మీకు ఇమెయిల్ లో పంపిస్తాము, మా వెబ్సైటు లో కూడా అందుబాటులోకి వస్తుంది (https://hearmatthew1128.org/) గమనించగలరు ఎవరైతే దీనిని నింపుతారో వారికి మాత్రమే ఆర్టికల్స్ వస్తాయి.
విశ్వాసములో మరియు సహవాసములో మీతో నడవడానికి మేము ఎదురుచూస్తుంటాం.