వారపు ఆధ్యాత్మికత:”కాదు” అని చెప్పుట మర్చిపోవుట : అబద్దపు గుర్తింపుకు బదులుగా ప్రభువైన దేవుని సత్యమును

Posted on January 3, 2026

Home Publications Posts వారపు ఆధ్యాత్మికత:”కాదు” అని చెప్పుట మర్చిపోవుట : అబద్దపు గుర్తింపుకు బదులుగా ప్రభువైన దేవుని సత్యమును

వారపు ఆధ్యాత్మికత:”కాదు” అని చెప్పుట మర్చిపోవుట : అబద్దపు గుర్తింపుకు బదులుగా ప్రభువైన దేవుని సత్యమును

వారపు ఆధ్యాత్మికత:కాదుఅని చెప్పుట మర్చిపోవుట : అబద్దపు గుర్తింపుకు బదులుగా ప్రభువైన దేవుని సత్యమును

ధ్యానాంశం : సంఖ్యకాండము 13, 14 అధ్యాయాలు.

ప్రియ దేవుని సంఘమా ,

ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో  వందనాలు  తెలియజేస్తున్నాను! ఈ నూతన సంవత్సరంలో   మనం  అడుగు  పెడుతుండగా, నూతన వాగ్దానాల కోసం  ఎదురు చూడడం సహజం, తాజా ఆరంభాలు, గతకాలపు బాధలు  గాయాలను  విడిచిపెట్టే విధానాలు సహజం.కానీ సంఖ్యకాండములో 13 , 14 అధ్యాయాలలో వున్న కధను చూచినట్లైతే, ఈ నూతన సంవత్సరంలోకి స్పష్టత మరియు ధైర్యంతో మార్గదర్శనము చూపే ఒక శక్తివంతమైన శిక్షణ మనం  కనుగొనగలం.

ప్రభువైన దేవుడు ఇశ్రాయేలీయులకు కానాను దేశాన్ని వాగ్దానం చేసాడు, కానీ ఆయన వారి బలం  ప్రకారం వారిని

పంపలేదు. ఆయనను వారు సంపూర్ణనంగా నమ్మినట్లైతే వారు ఏలా అవుతారో దానికోసం  అయన వారిని

పంపారు. పది మంది గూడచారులు ఆ పట్టణాన్ని అన్వేషించారు కానీ తప్పుడు నివేధిక తో తిరిగి వచ్చారు. ఆ ప్రదేశం

ఆశీర్వాదాలలో లోటు వున్నట్లు కాదు గానీ, వారి మనసులు ,హృదయాలు దేవుని  విధానంతో ఏకం కాకపోయినందున  , ప్రభువైన దేవుని  సత్యం మీద ఆనుకొనడానికి బదులు వారు భయం  వారి స్థితిని నిర్దారించడానికి  అప్పజెప్పు కొన్నారు.

ఇక్కడే ఒక విషయముంది: కొన్ని సమయాల్లో, మన జీవితాల్లో తప్పుడు ప్రశ్నలకు వద్దు ,కాదు అని చెప్పడం

మరచిపోతుంటాం.

“ నేను ఇది నిజంగా  చేయగలనా? లేక  “నేను నిజంగా సరిపోతానా “? – ఈ ప్రశ్నలే మనను భయంలో

నిర్బందిస్తాయి. ఆ పది మంది గూడచారులలా, మనం కూడా దేవుని వాగ్దానాలకు బదులుగా   మనం ఎంతవరకు చేయగలమో  అని దానిపైన ద్యాస పెడుతుంటాం. భయం వలన, మనకు పొందిన  పేర్ల వలన, ఈ లోకపు అబద్దాల వలన, మరియు శత్రువు మనపై మోపిన పరిమితుల వలన ఒక తప్పుడు గుర్తింపు తో మనను  రూపించడానికి. మనకు మనమే చోటిస్తున్నాము.

కానీ నిరీక్షణ ఉంది .యేసు క్రీస్తు మనను   మనం నిజంగా ఏమై ఉన్నామో కనుకోడానికి ఆహ్వనిస్తున్నారు. భయం, అనుమానం మరియు అబద్దపు గుర్తింపు నుండి ఆయనలో నిజంగా మనము ఎవరిమి ? అని గ్రహించే స్వాతంత్ర్యములోకి  మనను పిలుస్తున్నారు.

ప్రభువైన దేవుని వాగ్దానాలు సాధ్యములా ? అని అడిగే బదులు, ఆయన సత్యముతో నా మనసు ఎందుకు

ఏకీభవించలేదని మనం  అడగాలి. మరియు  తర్వాత ఆయన పునరుద్ధీకరణ చర్యకు  మనని మనం అప్పగించుకోవాలి . యెహోషువా

మరియు కాలేబు ఇతర గూడచారుల  లాగే అదే బలిష్టులను మరియు ప్రాకారములు గల పట్టణములను చూసారు ; వారికి  కనిపించిన దానికంటే దేవుని వాక్కును విశ్వసించడానికి ఎంచుకున్నారు. వారి ఆత్మవిశ్వాసం వారి బలం లో  లేదు గానీ

విజయాన్ని  వాగ్దానమిచ్చినవాని లో  ఉంది. ఎప్పుడైతే మన మనసులు ప్రభువైన దేవుని సత్యంతో

ఏకీభవిస్తాయో, మనం ఇంక ఎప్పుడూ భయం వలన నిర్ధారింపబడము కానీ విశ్వాసము వలనే నిర్ధారింపబడతాము.

అబద్ధాలతో మనం ఇక మీదట రూపింపబడము ,కానీ మనలో వున్న యేసుక్రీస్తు సత్యం వలననే

రూపింపబడతాము..

కనుక ఈ నూతన సంవత్సరానికి  ప్రశ్న ఏంటంటే: “ మన భయం యెక్క తప్పుడు నివేదికను అంగీకరిస్తామా లేక

యేసు క్రిస్తు మనం ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడో ఆ గుర్తింపులోనకి ధైర్యంగా అడుగు పెడదామా – ఆయన లో నిజంగా జీవం కలిగి

వున్నామా? మన పరిమితులకు”  కాదు”అని చెప్పడం మరిచిపోతున్నాము, ఈ వాగ్దానాలు భూమిని మరియు

పరమును సృష్టించిన సృష్టి కర్త నుండి చచ్చాయని మరచిపోతున్నాము. యేసుక్రీస్తు ద్వారా, మనం కొనుక్కోబడ్డాం,

విమోచింపబడ్డాం,  ప్రభువైన దేవుని మహిమకై సమస్తాన్ని స్వతంత్రించుకోవడానికి వారసునిగా  చేసాడు.

ఈ సంవత్సరం భయానికి , అనుమానానికి మరియు పరిమితులకు “ కాదు “ ; అని చెబుతూ ఈ సంవత్సరమును మెదలు పెడదాం. ప్రభువైన దేవుని మహాదైశ్వర్యముకు “అవును “ అని చెబుదాం. ఆయన మిమ్మల్ని చూస్తున్నట్లు మిమ్మల్నిమీరు చూసుకోండి. మీకు అనిపించే దాని బట్టి లేక ఈ ప్రపంచం చెప్పేదాని బట్టో జీవించక మిమ్మును తన బిడ్డగా పిలుచుకునే వాని వాగ్దానాన్ని బట్టి జీవించండి .

పరివర్తన: ఈ రోజు, ప్రభువైన దేవుని వాగ్దానాలు మీ భయాలు లేక పరిమితుల కన్నా గొప్పవని గుర్తుంచుకోండి.

సంఖ్యూకాండం 13 మరియు 14 అధ్యాయాలలోని పది మంది గూడచారులులా, అనుమానం ,తప్పుడు

గుర్తింపు మనని మనం ఎలా చూసుకొనేలా చేస్తున్నాయో గ్రహించొచ్చు  . కానీ

యేసుక్రీస్తు, మనను భయం లోనుండి బయటకు వచ్చి ఆయనలో మన “నిజమైన మనలను “గర్తిం చడానికి

పిలుస్తున్నారు. యోహోషువా , కాలేబు చూచిన వాటికి బదులు గా ప్రభువైన దేవుని వాక్కును

విశ్వసించడానికి ఎన్ను కొన్నారు, వారి బలం కన్నా ఆయన వాగ్దానాన్ని నమ్మారు. ఈ నూతన  సంవత్సరంలో,

భయముకు, అనుమానముకు, పరిమితులకు “కాదని “ చెప్పి నీ కొరకైన యేసు క్రీస్తు సంపూర్ణ జీవమునకు “;అవును “

అని చెప్పండి – (అంగీకరించండి). మీకు అనిపించిన వాటిని బట్టి లేక ఈ లోకము చెప్పిన వాటి బట్టి జీవించక, ప్రభువైన దేవుని సత్యము మరియు వాగ్దానములను బట్టి జీవించుడి.

ప్రార్ధన : ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామములో కృతజ్ఞత గల హృదయాలతో మీ ముందుకు వస్తున్నాము. మీ కృపకు, కనికరములకు మరియు గత సంవత్సరములో అనేకమైన అపాయముల నుండి కాపాడినందుకు మీకు మా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సంరక్షణకు మేము నిజముగా కృతజ్ఞలము. మీ ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు, మా ప్రతి అవసరత లో మీ పరిశుద్దాత్మ నడిపింపును ఇచ్చి, తద్వారా మీ మహిమను చూచునట్లు మరియు మీరు మాకు ఇచ్చిన రక్షణలో సంతోషించునట్లు మాకు ఇచ్చిన దానిని బట్టి వందనాలు.ప్రభువా, మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదములను మర్చిపోయి ఈ లోకపు అబద్దాలను నమ్మే చెడు అలవాటు నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మమ్మును బలపరచండి, మీదయను మాకు అనుగ్రహించండి, మమ్మును ఒప్పింపజేయండి, మరియు మాకు జ్ఞానము దయచేయండి.. మమ్మల్ని మీకు దగ్గరగా చేసుకోండి. ఈ ప్రార్ధన మీ దృష్టికి అంగీకారమవును గాక, యేసు క్రీస్తు నామము లో ప్రార్దిస్తున్నాం ఆమెన్.

సందేశం: తప్పుడు గుర్తింపులు లేక భయాలు నిన్ను నిర్ధారించుటకు అప్పగించే బదులుగా ప్రభువైన దేవుని వాగ్దానాల్నివిశ్వసించండి. ఆయన లో సంపూర్ణమైన జీవము గల మీ  “ నిజస్థితి “లోనికి అడుగు పెట్టుటకు మిమ్మును యేసుక్రీస్తు పిలుచుచున్నారు. అనుమానాలకు మరియు పరిమితులకు “ కాదు “ అని చెప్పండి,అయన వాగ్దానము చేసిన విజయముకు మరియు జీవమునకు  “ అవును “ అని చెప్పండి.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయిత. రెవరెండ్. ఇమ్మానువేల్ అరుల్ పాల్. హియర్ మేత్త్యూ 11:28 మినిస్ట్రీస్

తరుపున. ముద్రణ జనవరి. 3.2026.తర్జుమా సహోదరి:జలజాక్షి).

ప్రకటనలు :

1.మీ శీషత్వపు ప్రయాణములో సహకారము కోరినట్లు అయితే ప్రతీ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు జరిగే మా శిష్యత్వపు

సమావేశమునకు మిమ్మును ఆహ్వానిస్తున్నాము..

Link:https://us06web.zoom.us/j/81144235750pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3

EvQTo9(meeting id:81144235750) (passcode:12345).

2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కోరినట్లు అయితే, అపాయింట్మెంట్ కొరకు ఈ లింక్ ను

వాడండి.https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment

3. మా మినిస్ట్రీస్ మరియు సమావేశాలు యెక్క సమాచారం తెలుసు

కొనుటకు https://chat.whatsapp.com/EokMFGuZdgb23Sg8 బషజాస్

4.మీరు మా ఆర్టికల్స్ ఇకమీదట తరచు పొందుకొనుటకు ఆశించినట్లు అయితే మీ పేరు మరియు ఇమెయిల్ ఐడి ని

పంపించండి. దీనిని ఉద్దేశించి మేము ఒక ప్రశ్న పత్రమును పూరించుటకు తయారుచేసం.అది నింపి పంపినట్లు అయితే

మీకు ఆరు నెలల సబ్స్క్రయిప్షన్ ప్లాన్ లో ఉంచబడతారు. మీకు కావలిసిన భాష ను ఎంచుకోవచ్చు-తమిళ్, తెలుగు,

ఆంగ్లము. ఆ భాషలో మీకు ముద్రణలు పంపబాతాయి. అన్ని బాషలను కూడా ఎంచుకోవచ్చు. ఇది ప్రతి ఆరు నెలలకు

ఒకసారి నూతనీకరిస్తాం. ప్రశ్న పత్రం తొందర్లో మీకు ఇమెయిల్ లో పంపిస్తాము, మా వెబ్సైటు లో కూడా అందుబాటులోకి వస్తుంది

(https://hearmatthew1128.org/) గమనించగలరు ఎవరైతే దీనిని నింపుతారో వారికి మాత్రమే ఆర్టికల్స్ వస్తాయి.

విశ్వాసములో మరియు సహవాసములో మీతో నడువుటకు మేము

 

Click Here to Download as PDF -> Telugu