వారపు ఆధ్యాత్మికత: మీ కుటుంబం ఎవరు?
ధ్యానాంశం : న్యాయాధిపతుల గ్రంధం 15 : 10-13.
12 అందుకు వారు మేము ఫిలిస్థియుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సమ్సోను మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను.
13 అందుకు వారు ఆలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారిచేతికి మేము అప్పగించెదమని చెప్పి,రెండు క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్దనుండి అతని తీసుకొనివచ్చిరి.
ప్రియ సంఘమా,
మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రషస్త నామములో మీకు సుభములు.
మిమ్మును ఒకటి అడగనియ్యిడి: మీరు ఎప్పుడైనా ఆటంక పరచబడినట్లు భావించారా, తప్పుగా అర్థం చేసుకోబడినట్లు, లేక మీ సొంత కుటుంబ సభ్యులు లేక మీకు బాగా దగ్గరైన వాళ్ళు మిమ్మును వెనక్కి లాగినట్లు అనిపించిందా? మీరు ఒంటరి కాదు. అత్యంత కఠినమైన పోరాటాలు అపరిచితుల నుండి కాదు, మన స్వంత వ్యక్తుల నుండే లేదా వర్గాల నుండే ఎదురవుతాయని పరిశుద్ధ గ్రంథం మనకు పదేపదే చూపిస్తుంది.
దీనిని కల్దీయుల వెనుక ఉన్న స్వభావాన్ని బట్టి మనం తేటగా చూడగలము. లేఖనములలో,కల్దీయులు కేవలము ఒక సామ్రాజ్యమే కాదు అది ఒక నకిలీ జ్ఞానం కలిగిన వ్యవస్థ – నేర్పరులుగా కనిపిస్తారు, ఆధ్యాత్మికంగా, మరియు నమ్మదగిన వారుగా కనిపిస్తారు, కానీ ప్రభువైన దేవునికి భిన్నముగా పని చేస్తుంటారు. వారు కేవలం ప్రభావము వలన ప్రభావితులు కాలేదు గానీ, చొరబాటు వలన, నమ్మకస్థులను మెల్లగా మార్చుట వలన మరియు గుర్తింపులను మార్చుట వలన, ప్రభువైన దేవుని జనులు లోపల నుండి బలహీనులైనంత వరకు ప్రలోభ పరిచినందు వలన ప్రభావితులైరి . బబులోను ఎటువంటి యుద్ధం లేకుండానే అకస్మాత్తుగా పడిపోయింది, దీనిని బట్టి బయటకు కనిపించే విరోధం కంటే కంటికి కనిపించని కుతంత్రమే (కుట్రలే) ఎక్కువ ప్రమాదకరమని అర్థమవుతోంది.
సమ్సోను గూర్చి ఆలోచించండి. అతని జీవితం శక్తివంతమైన విజయాలతో పాటు బాధాకరమైన నిర్ణయాలతోనూ కూడి ఉంది. అతను తప్పుడు సంబంధాలను ఎంచుకున్నప్పుడు, ఆ నిర్ణయాల పర్యవసానాలను కేవలం అతను మాత్రమే కాకుండా, అతని చుట్టూ ఉన్న వారు కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే: ఫిలిష్తీయులు సంసోనును ఆపాలనుకున్నప్పుడు, వారు మొదట నేరుగా అతనిపై దాడి చేయలేదు. దానికి బదులుగా, వారు సంసోను స్వంత ప్రజలైన యూదా వారిపై ఒత్తిడి తెచ్చారు. ఫిలిష్తీయుల పాలనలో భయంతో బతుకుతున్న యూదా ప్రజలు, సంసోనును బంధించి శత్రువుకు అప్పగించడానికి సిద్ధపడ్డారు.
మనం ఇక్కడ కాసేపు ఆగి ఆలోచించాల్సిన (ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన) ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. శత్రువు విరుచుకుపడినప్పుడు మీతో నిలబడేవారే నిజమైన కుటుంబం—అది వారికి అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, వారికి నష్టం కలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా మీ వెంటే ఉండాలి. ప్రజలు భయం వల్ల గానీ, శరీర ఇచ్ఛల వల్ల గానీ లేదా లోక సంబంధమైన విషయాల వల్ల గానీ నడిపించబడినప్పుడు, పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నంతవరకు వారు మీతో చాలా మర్యాదగా మాట్లాడవచ్చు. కానీ ఒత్తిడి ఎదురైనప్పుడు, వారు విశ్వాసం కంటే తమ రక్షణకే ప్రాధాన్యత ఇచ్చి, మిమ్మల్ని శత్రువు చేతికి అప్పగించవచ్చు. ఇలాంటి పరిస్థితులను మనం ఒకటి కంటే ఎక్కువసార్లు చూశాము. చివరికి యేసుక్రీస్తు కూడా ద్రోహానికి గురయ్యారు—అది ఎవరో అపరిచితుడి వల్ల కాదు, ఆయనతో ఉన్న పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూదా వల్లే. ఆయనతో అత్యంత సన్నిహితంగా నడిచిన వ్యక్తి. బయటకు ఎంతో నమ్మకస్థుడిగా కనిపించిన వ్యక్తి.
కనుక మిమ్మును సన్నితముగా అడగ నివ్వండి: మీరు ఎప్పుడైనా నమ్మకద్రోహానికి గురైనట్టు మీకు అనిపించిందా? మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా లేదా సంబంధాల పరంగా బంధించినట్లు లేక శత్రువులకు అప్పగించినట్లు అనిపించిందా? అయితే మీకో శుభవార్త. మనకంటే ముందుగా నడుస్తూ, వంకర మార్గాలను సరాళం చేసే ఆ దేవుడు తనతో కలిసి నడవమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ పోరాటాలను మనం ఒంటరిగా చేయమని ఆయన అడగడు. మనం ఆయనతో కలిసి నడిచినప్పుడు, ఆయనే మన పక్షాన ఉండి పోరాడతాడు.
అయితే, మనం వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్నాడు. సరైన కుటుంబాన్ని వెతుక్కోవడానికి మనం మన సమయాన్ని మరియు శక్తిని వెచ్చించాలి. సవాళ్లు, బెదిరింపులు లేదా ఒత్తిళ్లు ఎదురైనప్పుడు కూడా మనతో పట్టుదలగా నిలబడే ఒక ఆధ్యాత్మిక కుటుంబం మనకు అవసరం. మనం తప్పులు చేసినప్పుడు మనల్ని వదిలిపెట్టకుండా, ఆ తప్పుల వల్ల కలిగే పర్యవసానాల్లో మనకు తోడుగా ఉంటూ, ప్రేమతో సత్యాన్ని బోధిస్తూ, మనం మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా ఎదిగేందుకు సహాయపడే కుటుంబం మనకు కావాలి.
నేను నిజాయితీగా ఒక విషయం చెబుతాను. సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారు చాలా మంది ఉన్నారు, కానీ స్వేచ్ఛను మరియు విశ్వాసాన్ని పెంపొందించే ఒక ఆరోగ్యకరమైన, దైవికమైన కుటుంబాన్ని వారు ఎప్పుడూ చూడకపోవడం వల్ల (అనుభవించకపోవడం వల్ల) వారు చాలా ఇబ్బంది పడుతుంటారు.
కాబట్టి, ప్రియమైన సంఘమా, మీరు దీనిని చదువుతున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: మనం ప్రజలను బంధించి శత్రువుకు అప్పగించే కుటుంబంగా ఉంటామా? లేక యేసుక్రీస్తు ప్రభువు అధికారం కింద అందరం కలిసికట్టుగా నిలబడి, ప్రార్థిస్తూ, బోధిస్తూ, తిరిగి పునరుద్ధరిస్తూ, పోరాడే కుటుంబంగా ఉంటామా?”
మనం సరైన నిర్ణయాలు తీసుకునేలా మరియు దేవుని హృదయాన్ని ప్రతిబింబించే కుటుంబంగా ఉండేలా ఆ ప్రభువు మనకు సహాయం చేయును గాక.
నేటి ధ్యానం :
జీవితము లో కొన్ని గొప్ప పోరాటాలు అపరిచితుల నుండి రావు గానీ మనకు దగ్గరైన వాల్ల నుండి వస్తాయని ఈ రోజు మనం జ్ఞాపకం చేయబడ్డాము. భయం మరియు రాజీ పడే తత్వం వల్ల, మనకు తెలిసిన వారు కూడా తాత్కాలిక రక్షణ కోసం దేవుని సంకల్పాలను వదిలివేస్తారని పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. సమ్సోను లాగా, మన బలం కేవలం మన శత్రువుల వలన పరీక్షింపబడదు కాని మనం విశ్వసించుటుకు ఎన్నుకున్న బంధాల వలన కూడా. అయినా మన ప్రభువైన దేవుడు మనకు ముందుగా వెళ్ళి, వంకర మార్గాలను శరాళము చేసి, మరియు మనం విధేయతతో నడిచినపుడు ఆయన మన కొరకు యుద్దము చేయును. మనకు ద్రోహం ఎదురైనప్పుడు కూడా యేసుక్రీస్తు దానిని అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఆయనతో అత్యంత సన్నిహితంగా నడిచిన వ్యక్తి ద్వారానే ఆయన శత్రువులకు అప్పగించబడ్డారు. ఈ సత్యము -భయముకు బదులుగా విశ్వాసముతో స్థిరముగా నిలబడే ఆత్మీయ కుటుంబముగా మారాలని మరియు వెదకాలని మనలను కోరుతోంది. ఈ రోజు మనము ఆ క్రీస్తు హృదయాన్ని ప్రతిబింబించే విశ్వసనీయత, జ్ఞానము మరియు ప్రేమను ఎన్నుకొందుము గాక.
ప్రార్థన :
పరలోక మందున్న తండ్రి, యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తున్నాము. అన్నిటి కన్నా ముందుగా నేను తప్పుడు ఎంపికలు చేసుకొని వాటి పరిణామాల వలన ఇబ్బంది పడినప్పుడు నన్ను ఒంటరిగా విడువకుండా నన్ను కాపాడినందుకు మీకు వందనములు. చాలా సార్లు, నేను ఈ లోక సంబంధమైన సూత్రాలను అనుసరిస్తూ నా కుటుంబం మారుతుందని ఆశించాను, కానీ మీరు పరిశుద్ధ గ్రంథంలో కుటుంబం మరియు సంబంధాల కోసం స్పష్టమైన మరియు పరిపూర్ణమైన సూత్రాలను ఇచ్చారు.నా హృదయాన్ని లోక సంబంధమైన సూత్రాల నుండి విడిపించి, మీ వాక్యములోని సూత్రాల ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయండి. మీరే నా నిజమైన కుటుంబం, నన్ను ఎల్లప్పుడూ నిజమైన సహవాసంలోకి నడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ, నా స్వంత సౌకర్యం కోసం నేను తరచుగా మీ మార్గము నుండి తప్పుకున్నాను. మీ ప్రేమపూర్వకమైన హెచ్చరికల కోసం మరియు క్రమశిక్షణ (సరిదిద్దడం) కోసం మీకు వందనాలు. యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చోవడం ద్వారా, విశ్వాసులతో కలిసి నడవడం ద్వారా మరియు అపవాదికి, సకల దుష్టత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బలపరచబడటం ద్వారా నేను సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఈ వారపు సందేశం :
మనకు ఎదురయ్యే గొప్ప సవాళ్ళలో కొన్ని బయట కనిపించే శత్రువుల నుండి కాకుండా, మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి నుండే ఎదురవుతాయి . భయం మరియు రాజీ పడే గుణం వల్ల, ప్రజలు దేవుని సంకల్పం కంటే తమ సొంత రక్షణకే ప్రాధాన్యత ఇస్తారు. వివేకంతో నడుచుకోవాలని మరియు ఒత్తిడిలో కూడా స్థిరంగా నిలబడే ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని మన చుట్టూ కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనల్ని కోరుతున్నారు. ఈ వారం మనం నేర్చుకున్న ముఖ్య పాఠం ఏమిటంటే—మనం కూడా అలాంటి కుటుంబంగానే ఉండాలి; అంటే దేవుని కింద అందరం కలిసికట్టుగా ప్రార్థిస్తూ, ఒకరినొకరు పునరుద్ధరించుకుంటూ, పోరాడే కుటుంబంగా ఉండాలి.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయిత. రెవరెండ్. ఇమ్మానువేల్ అరుల్ పాల్. హియర్ మేత్త్యూ 11:28 మినిస్ట్రీస్ తరుపున. ముద్రణ జనవరి. 10.2026.తర్జుమా సహోదరి:జలజాక్షి).
ప్రకటనలు :
1.మీ శీషత్వపు ప్రయాణములో సహకారము కోరినట్లు అయితే ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు (IST) జరిగే మా వారంతపు శిష్యత్వ సమావేశాలలో చేరవలసిందిగా మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
Link:https://us06web.zoom.us/j/81144235750?pwd=EsfuED6du4T8YMjFdSXdpvWuPXpCOW.1
(Meeting ID: 811 4423 5750. Passcode: 12345).
2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కోరినట్లు అయితే, అపాయింట్మెంట్ కొరకు ఈ లింక్ ను వాడండి.
https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment
3.మా పరిచర్యలు (ministries) మరియు సమావేశాల గురించిన తాజా సమాచారం మరియు వార్తలు తెలుసుకోవడానికి, మా వాట్సాప్ (WhatsApp) గ్రూప్‌లో చేరవలసిందిగా మీకు స్వాగతం పలుకుతున్నాము. https://chat.whatsapp.com/EokMFGuZdgb23Sg8BsHzas
4.మీరు మా ఆర్టికల్స్ ఇకమీదట తరచు పొందుకొనుటకు ఆశించినట్లు అయితే మీ పేరు మరియు ఇమెయిల్ ఐడి ని పంపించండి.
దీనిని ఉద్దేశించి మేము ఒక ప్రశ్న పత్రమును పూరించుటకు తయారుచేసం.అది నింపి పంపినట్లు అయితే మీరు ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో నమోదు చేయబడతారు. మీరు ప్రచురణలను పొందాలనుకుంటున్న భాషలను—తమిళం, ఇంగ్లీష్ మరియు/లేదా తెలుగు—ఎంచుకోవచ్చు. మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను ఎంచుకునే అవకాశం ఉంది. మేము ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ప్రక్రియను పునరుద్ధరిస్తాము.
ప్రశ్నావళికి సంబంధించిన లింక్ త్వరలో మీకు ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది మరియు మా వెబ్‌సైట్ (https://hearmatthew1128.org/) లో కూడా అందుబాటులో ఉంటుంది. గమనిక: ఇకపై ఆధ్యాత్మిక వ్యాసాలు (devotional articles) కేవలం ఈ ఫారాన్ని పూర్తి చేసి, ఈ ప్రక్రియ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే పంపబడతాయి.
విశ్వాసములో మరియు సహవాసములో మీతో నడువుటకు మేము ఎదురుచూస్తుంటాం.