అనుదిన ద్యానము : ఉద్దేశాలు మాత్రము సరిపోవు.
ధ్యానాంశము : 2 సమూయేలు 6:6,7.
యేసు క్రీస్తు చెప్పెను; నేనే మార్గమును, సత్యమును, జీవమును.” (యెహను 14:6) ఇది వినుటకు సులభముగా వుండవచ్చు కానీ జీవించుటకు కష్టం. దేని విషయమైనా మన మంచి ఉద్దేశాలు లెక్కింపబడతాయని ఆలోచించుటకు మనం ఇష్టపడతాము, మన హృదయాలు సరియైన స్థానములో వుంటే దేవుడు అర్ధం చేసుకుంటారు అని. కానీ వాక్యం చూపిస్తుంది- కేవలం మంచి ఉద్దేశాలు అన్ని సార్లు దేవుని విధానాలు కాలేవు.
సమూయేలు 6 వ అధ్యాయములో ఉజ్జా ని తీసుకుందాం. దేవుని మందసము మోయబడుతుండగా ఎడ్ల కాలు జారినపుడు, ఉజ్జా అది పడిపోకుండా వుండుటకు వెళ్ళెను. హనికరము కానట్లు, ఇంకా గౌరవము చూపి నట్లు కనిపిస్తుంది కదా ? కాని దేవుడు అతనిని మొత్తెను. ఉజ్జా చెడ్డవాడని ఆలాగు చేయలేదు. కాని ఆయన దేవుని ఆజ్ఞ కాని దానిని చేసేను. ఆయన హృదయ ఉద్దేశం మంచిదే, కాని ఆయన చేతులు దేవుని విధానమును మించి కదిలెను.
ఈ కధ నన్ను కలవర పరచెను. దేవుని వాక్కును మించి మన భావోద్వేగాలను విశ్వశించటం ఎంత సులభము అని ఇది మనకు గుర్తు చేస్తుంది. అపవాది దీన్ని ప్రేమిస్తుంది-అపవాది మనలను ఏది సరియైనది అన్న మన అభిప్రాయలను ఆధారము చేసు కొనుటకు ప్రేరేపిస్తుంది, ఏది సరియైనది అన్న నిజము కన్నా. వాక్యం చెబుతుంది, మన హృదయాలు పాపముతో భ్రష్టుపట్టినవి. మనము ఎంత నిజాయతీగా వున్నప్పటికీ, విరిగిన హృదయము నుండి పుట్టిన ఏదీ దేవునికి అవసరమైన పరిశుద్ధత ను పుట్టించ లేదు.
అందుకే మనకు యేసు క్రీస్తు కావలెను. మన ఉద్దేశాలు మనలను రక్షించలేవు; కేవలం ఆయన రక్తం మాత్రమే రక్షించగలదు. మనము సరిచేయలేని పరిస్థితుల్లో ఆయన వచ్చి మనకు ముందుకు నూతన విధానమును కలుగజేయును. యెషయా 45:2 లో దేవుడు ప్రమాణము చేయు చున్నారు, నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుపగడియలను విడగొట్టెదను”. అది దేవుని స్వరము చెప్పినది, “నన్ను నడిపించనియ్యుడి, మీరు అనుసరించుడి/ వెంబడించుడి. కనుక మీ మంచి ఉద్దేశాలు మీకు సాకులు కాకుండా చూచుకొనుడి. బదులుగా యేసు క్రీస్తుపై మీ దృష్టిని నిలుపుడి. ఆయన మార్గమును అనుసరించుడి, అది అసహజముగా అనిపించినప్పుటికీ, అక్కడే నిజమైన సంతోషం ఆరంభమౌతుంది- సరియైనది అన్న ‘క్షణికమైన సంతోషము కాదు గానీ, “మరి లోతైన అక్షయమైన రక్షణ సంతోషము .
సందేశము: ఎపుడైతే మన సొంత జ్ఞానము లేక అవగాహన నుండి మన ఉద్దేశాలు వస్తాయో,మన మంచి ఉద్దేశాలు కూడా దేవుని హృదయమును గెలవలేవు. ఉజ్జ కధ మనకు జ్ఞాపకము చేస్తుంది-ఏది సరియైనది అని అనిపిస్తుందో అది, దేవునికి విధేయతలో నడువుట,- ఒకటి కాదు. యేసు క్రీస్తు ఆయన మార్గమును వెంబడించుటకు మనలను పిలిచెను. కేవలము మంచి ఉద్దేశములతో కాక, అప్పగించుకొనే అడుగులతో వెంబడించవలెనని.
ప్రార్ధన : పరలోకపు తండ్రీ, యేసు క్రీస్తు నామములో, కృపా సింహాసనము దగ్గరకు మీ కనికరముకై వస్తున్నాను. నా ఉద్దేశములను మించి మీ విధానములకు ప్రాముఖ్యతను ఇచ్చుటకు సహయము చేయుము. నా జీవితము ద్వారా కేవలము నీవే మహిమను పొందుకొనుము, మీ స్వభావము నాలోనుండి ప్రతిబింబించునట్లు సహయము చేయుము. దేవా నా కోరికలు మిమ్మును ప్రియ పరుచునంతటివి కావు. అనుదినము క్రీస్తు యొక్క మార్గమును కోరుకొనునట్లు నాకు కృపను అనుగ్రహింపుము. మరియు నా ఉద్దేశములు సాకుగా చేసుకొనకుండు నట్లు సహాయము చేయుము,కుమ్మరి చేతిలోని మంటి పాత్రలా నేను మీకు అప్పగించుకొనుచున్నాను, యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్.
పరివర్తన : నా ఉద్దేశాలకు వాక్యము లేక పరిశుద్దాత్మ మార్గదర్శకాలుగా వున్నాయా? నా క్రియలు ఆయన సత్యములో నుండి జరుగుతున్నాయా లేక నా సొంత తార్కిక విశ్లేషణ ద్వారా చేస్తున్నానా? సరియైన విషయములను జరిగించుటలో సంతృప్తి పొందుతున్నానా లేక ఆయనకు అప్పజెప్పుకోనుచు ఆయనకై వేచియుండుటలో సంతృప్తి పొందుతున్నానా?.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత రెవరెండ్ ఇమ్మానువేల్ అరుల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ. 15. నవంబర్. 2025, తర్జుమ: సహోదరి.జలజాక్షి.)
ప్రకటనలు:
1. మీ శిష్యత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే మా వారాంతపు శిష్యత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం – ప్రతి శనివారం జరుగును. ఉదయం 6 గంటలకు. Zoom Link: https://us06web.zoom.us/j/81144235750? pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3EvQT09.(meeting id:81144235750.passcode:12345)
2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము ఆశిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మా సమా చారములకై https://chat.whatsapp.com/FQuH58GtkEEApPCm9gN8no
వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు :https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment.
Click Here to Download as PDF->Telugu