ఈ వారం ఆధ్యాత్మిక భాగం : దేవుని యెక్క “అవును” మరియు ” ఆమెన్ “.
ధ్యానాంశం : 2 కొరింది 1:20 దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై ఉన్నాయి .
ఈరోజు, ఒక క్రొత్త విధానంలో దేవుని వాగ్దానాల యొక్క శక్తిని మరియు అర్ధాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి మరియు స్థిరమైనవి. క్రీస్తులో ఆయన సమాధానం ఖచితమైంది – సంపూర్ణంగా అవును అని, మరియు మనము తధాస్తు (ఆమెన) అని స్పందించినప్పుడు, నిజంగా, అలాగే ఉండునుగాక, అదే జరుగును గాక” అని మనం ప్రకటిస్తున్నట్లు, ఆమెన్ అనేది మన అంగీకారపు మాట, దేవుని యొక్క విశ్వసనీయత మీద మనకున్న నమ్మకపు ముద్ర . ఈ వాక్యం సున్నితం కాని శక్తివంతమైన భాగం ఇదే : ఆయనలో అన్ని అంగీకారములు(అవును), (ఆమెన్) ఆయన ద్వారా, మరియు ఇవి అన్నియు దేవుని మహిమ కొరకే.
ఆయన లో- దేవుని వాగ్దానాలు ఎప్పుడూ అస్తవ్యస్తము లేక అసంపూర్ణమైనవి కావు. అవి క్రీస్తులో కేంద్రీకృతమైనవి. మన నిరీక్షణ, నమ్మకం, మరియు సంతోషం అన్నీ ఆయనతో లంగరు వేయబడినవి.
ఆయన ద్వారా – దేవుని ఆమెన్ కేవలం ఒక నివేదిక మాత్రం కాదు; అది మన జీవితాలలో క్రియాశీలకమైనది.క్రీస్తు ద్వారా ఆయన వాగ్దానాలను సంపూర్ణం చేస్తుంది. ఆశీర్వాదములు, మార్గదర్శకత్వం మరియు రూపాంతరం – అన్ని ఆయన ద్వారా ప్రవహిస్తున్నవి.
దేవుని మహిమ కొరకు దేవుడు చేసే ప్రతీదీ, ప్రతీ అవును, మరియు ఆమెన్ చివరికి ఆయన మహిమను సూచిస్తుంది. మన జీవితాలే ఆయన విశ్వసనీయతను ప్రదర్శించే చిత్రాలు.
ధ్రువీకరణ మరియు పరివర్తన: తరుచు, మనకు కావలసినవి దేవుడు సులభంగా ఆమోదిం చాలని నిరీక్షిస్తూ మనం ప్రార్ధిస్తుంటాము. ఆయన “సరే ముందుకు సాగు అని ఊ కోడుతూ చెప్పాలని ఆశిస్తుంటాం. కానీ దేవుని హృదయం కేవలం మన కోరికలను తీర్చడమే కాక మనలను పరివర్తన చేస్తుంది . ఆయన వాగ్దానాలు, మనం ఎలా వుండాలని ఆయన అనుకున్నారో అలా ఉండడానికి తీర్చి దిద్దడం కోసమే. కొన్ని సమయాలలో ఆయన అంగీకారం మనని త్వరగా సంతోషపెట్టేవి కావు : అది నిజంగా మనలను ఉన్నతంగా చేస్తుంది, మన స్వభావాన్ని శుద్దీకరిస్తుంది, మరియు ఆయనకు దగ్గర చేస్తుంది.
అన్ని మంచి భావాలు మంచివి కావు:
భావాలు గమ్మతైనవి. సామెతలు 14:12 హెచ్చరిస్తుంది:” ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును “. మనకు మంచిగా అనిపించేవి ప్రతీసారీ మంచిది కాదు. మన భావోద్వేగాలు మనని తప్పుదారి పట్టించొచ్చు, కానీ దేవుని వాక్కు మారని స్థిరమైన సత్యం. ఆయన అంగీకారం మన క్షణికమైన కోరికలలో వేరు పారినది కాదు, అది ఆయన సంకల్పంలో సరియైన జ్ఞానంలో వేరుపారినది.
దేవుని ఏర్పాటే వాక్యం :
పరిశుద్ధ గ్రంథంలో ప్రతీ మాట దేవుని నుండి వచ్చింది (2 తిమోతి 3:16). ప్రతీ వాగ్దానం ఉద్దేశపూర్వకమైనది, ప్రతీ సత్యం జీవంగలది మరియు పని చేయునది. యెషయా 55:11 మనకు గుర్తు చేసేది ఏమిటంటే ఆయన వాక్కు” నిష్పలముగా నా యెద్దకు మరలక అది నాకు అనుకూలమైనదానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును.” మనం దానిని సంపూర్ణముగా అర్ధం చేసుకోలేనప్పటికి దేవుని అంగీకారం ఆయన వాగ్దానములలో దొరుకుతుంది, మరియు వాటి ద్వారా, నిత్యమైన మేలులను మన జీవితాలలో ఆయన జరిగిస్తాడు-.
దేవుని అంగీకారం వలన రూపాంతరము చెందిన ఆత్మ లభిస్తుంది. ఇది నిజం : మన ఆత్మలు దేవుని అంగీకారం పూర్తిగా గ్రహించలేవు ఎందుకంటే మనం శరీరంలో, పరిమిత స్థితిలో జీవిస్తున్నాము. ఆయన అంగీకారం ఎప్పుడు మనకు క్షణికమైన సంతోషాలను ఇవ్వదు. కొన్ని సమయాల్లో క్షమశిక్షణ లేక సరిదిద్దడంలాగా అనిపిస్తుంది. కానీ, ఇదే మన ఆత్మలకు కావలసినది. ప్రభువు యెక్క ఒప్పందం మనను నాశనం చేసే మన కోరికలనుండి మనను విడిపించి, మనకు హాని చేసే వాటి మీద మన వాంఛను మరల్చుకోడానికి, మరియు నిత్య సంతోషం లోకి మనను నడిపించడమే. దేవుడు అంగీకారం తెలిపినప్పుడు- అది కోరికలను తీర్చుకోవడానికి కాదు-అది రూపాంతరము, విముక్తి మరియు ఆయనలో నిజమైన ఆనందం కోసం.
కాబట్టి ఈరోజు, దేవుని నిశ్చయమైన వాగ్దానాలలో విశ్రాంతి పొందుదాం. విశ్వాసంతో ఆమెన్ అని చెబుదాం, ఆయన అంగీకారం సరియైనదని విశ్వసిద్ధాం, దాని సంపూర్ణ ప్రభావం చూడలేనప్పుడు కూడా. మన సంతోషం, సంతృప్తి మన శరీరం యొక్క క్షణికమైన సంతోషాల వలన రాదు, కానీ ఎల్లప్పుడూ వాగ్దానము తప్పని, మేలైన, విశ్వసనీయమైన దేవుని లో జతపరచబడిన ఆత్మ వలన దొరుకుతుంది. దేవుని అంగీకారం కేవలం ఆమోదం కాదు- అది జీవాన్ని ఇచ్చే ఆత్మ యెక్క లోతైన రూపాంతరం. ఆమెన్.
పరివర్తన : దేవుని వాగ్దానాలు ఎప్పుడు అనిశ్చయమైనవి కావు. క్రీస్తులో, ప్రతీ వాగ్దానం స్థిరమైన అంగీకారం, మనం ఆమెన్ అని ఎప్పుడు స్పందిస్తామో, మనం దేవుని విశ్వసనీయమైన ప్రణాళికను ఒపుకొంటున్నట్టు లెక్క. ఆయన అంగీకారం కేవలం మన కోరికల ఆమోదం కాదు, కానీ మన హృదయాలను తీర్చి దిద్దె రూపాంతర క్రమము. మన వాంఛలను మరల్చును, నిజమైన సంతోషం లోకి నడిపిస్తుంది. అది క్షమశిక్షణ లేక సరిచేయబడడం లాగా అనిపించినా, దేవుని అంగీకారం క్రీస్తు ద్వారా మన మేలుకై మరియు ఆయన మహిమకై పని చేస్తుంది. ఈరోజు ఆయన సరియైన అంగీకారాన్ని విశ్వసిద్దాం, విశ్వసంతో ఆమెన్ అని చెబుదాం, ఆయన స్థిరమైన మారని వాగ్దానాలలో విశ్రాంతి పొందుదాం.
ప్రార్ధన: మా పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామంలో మీ ముందుకు వస్తున్నాము. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా రక్షణకై మీ అద్వితీయ కుమారుని ఇచ్చారు. ఇది మీరు మాకు ఇచ్చే విలువ యొక్క పరిమితి,అయినా అనేక సార్లు ఆ విలువను అర్థం చేసుకోవడంతలో విఫలమౌతున్నాము, మీరు మమ్మల్ని వుంచిన స్థానం కన్నా మేము దిగజార్చుకుంటున్నాము, మేము పాపుల మైనప్పటికీ, మమ్మల్ని శ్రేష్టులుగా పిలుస్తున్నారు; మేము యోగ్యులం కానప్పటికీ, ఇంకా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈరోజు నిజంగా మీలో మీ ఏర్పాటులో సంతోషించేటట్టు మమ్మును మీ ముందు తగ్గించుకొనుచున్నాము. మీరే సంపూర్ణమైన ప్రేమ, సంతోషం మరియు సమాధానం. మా జీవితాలలో మీ రక్షణ సంతోషం నిత్యం వుండును గాక- క్షణికమైన ఇహలోక సంతోషాల కన్నా. మమ్మల్ని నూతన పరుచు ప్రభువా, మీ మంచితనాన్ని మేము రుచి చూచి తెలుసుకునేటట్లు సహాయం చేయుము. మాకు వ్యతిరేకముంగా ఎదుగు ప్రతి మోసమును మరియు ఆరోపణల నుండి విడిపించుము, యేసు క్రీస్తు నామంలో ప్రార్ధిస్తున్నాము, ఆమెన్.
సందేశం : దేవని వాగ్దానాలు క్రీస్తులో స్థిర అంగీకారాలు, మరియు మన ఆమెన్ ఆయన విశ్వసనీయత పై మన నమ్మకం. ఆయన అంగీకారం కేవలం మన క్షణిక కోరికలను సంతృప్తి పరచవు, కానీ మనను రూపాంతరము చెందేలా చేస్తుంది, నిజ సంతోషంలోకి నడిపిస్తుంది. అది సరిచేయబడుతున్నట్టు అనిపించినా, దేవుని ఆమెన్ మన మేలుకు ఆయన మహిమకై పనిచేస్తుంది. ఈ విధంగా, నేను మిమ్మును ఆయన మారని వాగ్దానములలో విశ్రాంతి పొందడానికి ఆహ్వానిస్తున్నాను.
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయిత. రెవరెండ్. ఇమ్మా నువేల్ అరుల్ పాల్. హియర్ మేత్త్యూ 11:28 మినిస్ట్రీస్ తరుపున. ముద్రణ డిసెంబర్, 20.2025. తర్జుమా సహోదరి:జలజాక్షి).
ప్రకటనలు :
1. మీ శీషత్వపు ప్రయాణములో సహకారము కోరినట్లు అయితే ప్రతీ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు జరిగే మా శిష్యత్వపు సమావేశమునకు మిమ్మును ఆహ్వానిస్తున్నాము..
Link:https://us06web.zoom.us/j/81144235750pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3 EvQTo9(
meeting id:81144235750) (passcode:12345).
2-వ్యక్తిగత కౌన్సెలింగ్ కోరినట్లు అయితే, అపాయింట్ మెంట్ కొరకు ఈ లింకలను వాడండి.
https://zoom.us/rev-immanuel-paul/appointment
3. మా మినిస్ట్స్ మరియు సమావేశాలు యెక్క సమాచారం తెలుసుకొనుటకుchat https://chat.whatsapp.com/EokMFGuZdgb23Sg8BsHzas విశ్వాసముతో మరియు సహవాసములో మీతో నడువుటకు మేము ఎదురు చూస్తుంటాం.
Click here to download as PDF -> Telugu