Article Telugu

Be strengthened by the word of God

Home Category : Article Telugu

అనుదిన ధ్యానము: మీ ప్రాముఖ్యతలను గూర్చి జాగ్రత్తపడుడి.

లేఖన ద్యానము: ఫిలిప్పీయులకు వ్రాసిన గ్రంథం 2:5.

మన జీవితాన్ని ఏది నిజముగా పాలిస్తుంది? మన ఆలోచనలని మన ప్రతిగటనలని, మన ఎంపికలని ప్రతీ రోజూ ఏది నిర్ధారిస్తుంది? మనము ఎప్పుడైనా నిలకడగా దీనిని పరిశీలించామా? మనలని మనము ప్రశ్నించుకునామా? పరిశుద్ద గ్రంథం లో చెప్పబడినది ఏమనగా మనము కేవలము ఆయన స్వారూప్యములో మాత్రమే చేయబడలేదుకానీ తత్వము లో కూడా. ఆయన స్వభావము, మహిమ, ప్రేమ, సత్యము మరియు నీతి మనలో నుండి ప్రజ్వలింప వలసినవై యున్నవి. కాని మనుష్య జాతి ఎప్పుడైతే పాపము చేసిందో, మనము ఆ మహిమను కోల్పోయాము. అయినా దేవుడు మనలను విడిచిపెట్టలేదు. ఆయన అపారమైన ప్రేమను బట్టి, ఆయన ‘కుమారుని పంపెను, మనము ఏదైతే కోల్పోయామె అది పొందుటకు మరియు ఆయన తో ఐక్యపరచబడుటకు. క్రైస్థవ్యం యొక్క నిజ సంకల్పము కేవలము నైతికముగా జీవించుట మరియు, సంఘమునకు వెళ్లుట మాత్రమే కాదు గానీ, అది దేవునితో ఐక్య పరచబడుటకు, అది ఏమనగా మనము సంపూర్ణముగా తన స్వారూప్యము లోనికి రూపాంతరము చెందు వరకు, ఆయన ప్రాముఖ్యతలు మన జీవితములో ప్రాముఖ్యమైనంత వరకు. కనుక మనము ఐఖ్యమవ్వాలనుకొనే ఈ దేవుడు ఎవరు? లేఖనములు ఈ విధముగా విశ్లేషపరుస్తుంది : దేవుడే ప్రేమ, ఆయనే సత్యం, ఆయనే సమాధానం, సంతోషం, కనికరము, విశ్వసనీయత, సౌమ్యత మరియు ఆశానిగ్రహం, ఆయన పౌరుషము గలవాడు కనికరమూర్తి. న్యాయము మరియు సూత్రములు గల దేవుడై యున్నారు. ఆయన తన సూత్రములను బట్టి సమస్తమును జరిగించును గనుక, ఆమన సూత్రములు మన హృదయాలలో వ్రాయబడనట్లు అయితే మనము ఆయన వారము కాలేము. అందు నిమిత్తమై పిలిప్పీ 2:5 చెబుతున్నదేమనగా: “క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సు మీరును ‘కలిగియుండుడి’. దీని గూర్చి ఆలోచించుడి, దేవుడు మనలను కేవలము నియమాలను పాటించాలని ఆశించుట లేదు. మనము క్రీస్తు వలే ఆలోచించాలి, అనుభవించాలి మరియు నడుచుకోవాలని ఆశిస్తున్నారు. ఆయన సూత్రములు మన హృదయాలలో ముద్రింపబడవలెనని ఆశిస్తున్నారు.

మనము సూత్రములను గూర్చి మాట్లాడినప్పుడు, నిజముగా అవి ఏంటి? ఆక్సఫర్డ్ నిగంటువు దృవీకరించినది,”ప్రాథమిక సత్యం ప్రవర్తనకు లేక నమ్మకమునకు పునాది అయి వున్నది : అది మనిషిగా నీవు ఎవరు, మీ స్వభావమును ఏది పాలిస్తుంది, మీ ఆలోచనలను ఏది ప్రేరేపిస్తుంది, ఏది మీ ప్రవర్తనను ముందుకి నడిపిస్తుంది, మరియు మీ ప్రాథమిక నిర్మాణం ఏంటి. మీ ఆత్మ ఎంత ఆరోగ్యకరముగా వుంది ? మీ ఆత్మ క్రీస్తును పోలిన సూత్రములతో నిండియున్నదా లేక ఇహలోక సూత్రములతో నిండియున్నదా? సామెతలు 4:23. “నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము”. మనము చేయునవన్ని హృదయము యొక్క స్థితిని బట్టి జరుగును. కనుక నిదానించి పరివర్తన చెందుదము. క్రైస్థవవులుగా మన హృదయములలో ఏం వున్నదని మనము ఎరుగుదుమా? మనము నిజముగా ఎవరమని విశ్లేషించుకుంటున్నామా? మరియు దేవునికి విరోధమైన సూత్రాలు మనం ఏం కలిగి వున్నామని? మనము నిదానించి పరివర్తన చెందినట్లు అయితే, మనము గమనించగలుగుతాము మనము క్రీస్తులో జీవించకుండానే క్రైస్తవ్య జీవితాన్ని జీవిస్తున్నామని. మనము యేసు క్రీస్తుని చూసినపుడు మనము సరియైన దైవిక సూత్రముల ఆచరణను చూడగలుగుతాము, ఆయన నిస్వార్ధము, కరుణామయుడు, కపటము లేని, వినయము, నిజాయతి, దైర్యము మరియు నమ్మకత్వము గలవారు. ఆయన ప్రజల యెక్క ఉద్దేశములకు ప్రభావితము కాలేదు. ఆయన ఎవరినీ ముఖస్తుతి చేయలేదు. లేక సంఘర్షన తప్పించుకొనుటకు సత్యమును మెలి పెట్టలేదు. ఆయన సమాధానములు- అవును,,కాదు. ఆయన నిక్కచ్చిగా వున్నా ప్రేమించారు. ఆయన వేషధారణను బయలు పరిచారు, బలహీనులను కాపాడారు, మరియు విరిగి నలగిన స్థితిని సరి చేసారు. తండ్రి చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకొంటూ ఇవి జరిగించారు. ఆయన తన శిష్యుల బలహీనతలలో బలపరిచెను. ఇతరుల కొరకు తన్ను తాను ప్రవహింప జేసుకొనెను కానీ ఆయన ఇతరులు ఆయనను వేదించనీయలేదు. ఆయన తన సౌకర్యము పొందుకొనుటకు జీవించ లేదు. మరియు మనము ‘పాత నిబంధనను’ విశ్లేషించినట్లు అయితే, నిబంధనలు దేవుని యొక్క స్వభావము యెక్క ప్రతిబింబముగా చూడగలుగు తాము. క్రొత్త నిబందన ఆ సారాంసమునే కొనసాగిస్తుంది: శిష్యులు మరియు అపోస్తులు క్రీస్తు యొక్క సూత్రములను ఆధారము చేసుకొని జీవించారు మరియు నిర్నయములు తీసుకున్నారు. ఎవరైనా ఆయన స్వభావము లేకుండా పని చేసినట్లైతే వారు బహిష్కరింపబడిరి లేక ఆయన ద్వారా క్రమశిక్షణ లోనికి తేబడిరి. దీనిని ఆధారము చేసుకొనే ఆదిమ క్రైస్తవ్యం మరియు సంఘము స్థాపింపబడినది.

కనుక మనకు ఇప్పుడు ప్రశ్న : మనమూ అదే ‘సూత్రములను ఆధారము చేసుకొని జీవిస్తున్నామా? మన మాటలు, సంబంధాలు, నిర్ణయాలు మరియు వ్యక్తిత్వం ఆయనను ప్రతిబించిచునట్లు వున్నదా? ఇది సులభమైన పని కాదు. అంతరంగము పై దృష్టించుట బాధాకరమైనది ఎందుకంటే కొన్ని సమయాల్లో క్రీస్తుతో మమేకము కాని స్వభావము కనిపిస్తుంటుంది. కాని అక్కడే రూపాంతరము ఆరంభమౌతుంది. యిర్మియా 17:10 చెబుతుంది, “ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల పలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.” మన అంతరంగములో వున్న సమస్యని గిర్తించినప్పుడు, మనము దాని స్వస్థతకై ఆయనకు అప్పజెప్పు కొనగలము. ఇది ఒక యుద్దము దానికి దేవుడే పోరాడుటకు సహయము చేయును. గలతీయులకు 5: 24,28 మనకు గుర్తుచేయునది:” క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యిచ్చల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము: మనము ఆయన సూత్రములలో లంగరు వేయబడినప్పుడు సాతాను తన పట్టును కోల్పోతాడు. ఎందుకంటే దేవుని సూత్రములు పాలించునపుడు ఆమన సాన్నిధ్యం ప్రభలమౌతుంది, మన సూత్రములను సరిచేసు కోకుండా సాతానును ఎదురించుట అర్ధము లేనిది. రోమా 8:31 -“ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?

ఆయన సూత్రములు మనలో వున్నప్పుడు, ఆయన మనతో వుంటారు. ఆయన గుణమును అంగీకరించనట్లు అయితే, ఆయన సాన్నిధ్యం మనలో వుండాలని ఎలాగు ఆశించగలము? ఈ రోజు ఆయన మన హృదయాలను పరిశోధించు నట్లు ఆయనను ఆహ్వానిద్దాం, మన మనసులను సరిచేయునట్లు, ఆయన ‘సూత్రములను మనలో లోతుగా వ్రాయునట్లు, క్రీస్తు వలే స్వభావము కలిగి జీవించునంత వరకు.

పరివర్తన : క్రైస్తువునిగా, మన సహజ స్వభావము ఏంటి ? ఏ పునాది మన ఆలోచనలను మరియు ప్రవర్తనను నియంత్రిస్తుంది? నీ ఆత్మను ఏ సూత్రం పాలిస్తుంది? ఎలాంటి స్వభావము కలిగి వున్నావు? నీ స్వభావము దేవుని స్వభావము తో అనసంధానముగా వున్నదా?

ప్రార్థన : మా పరలోకపు తండ్రి, మేము తరచూ మీ స్వభావము ను కలిగి వుండలేక పోతున్నాము, నీవు ఈ భూమిపై ఉదాహరణగా జీవించి చూపించిన సూత్రములను తెలుసుకోలేక అజ్ఞనులుగా వున్నాము. మా జీవితాలను ఎలాగోలా జీవించాలని అవగాహన లేకుండా జీవిస్తున్నాము . మేము మా జీవితాలలో మీలా జీవిస్తున్నామా లేదా అని నిదానించి ఆలోచించలేక పోతున్నాము. మాకు నిజమైన పునాది ఏది అని మాకు తెలియ జేసిన విధానము బట్టి వందనములు. మా యొక్క ఆలోచనలను మా హృదయాలను మీ సూత్రములు నియంత్రించి పాలించును గాక. మీ యెక్క గుణాతిసయములు మరియు తత్వము మా ఆత్మలను పాలించును గాక, తద్వారా మాలో వున్న మీ గణము ఇతరులకు సహయము చేయునట్లు. రాజులకు రాజైన ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన నామములో అడుగుచున్నాము ఆమెన్.

సారాంశము : క్రైస్తవ్యం కేవలం ప్రార్ధించుట, వాక్యము చదువుట, సంఘమునకు వెల్లుట, క్రైస్థవ సంగీతము వినుట, సువార్తను ప్రకటించుట మాత్రమే కాదు. అది మనలను ఏది నియంత్రిస్తుందో దాని పరివర్తన. దేవుని ఆలోచన మన ఆలోచనావిధానమును పాలించునట్లు అయితే దేవునికి విరోధమైన ప్రతీవాటిని మన జీవితములో నుండి సులభముగా తీసివేయగలుగుతాము. మనము తరచు ఆర్థికముగా, సంబంధాలలో, వృత్తి లో విఫలమౌతుంటాము కారణం మనం మన సూత్రాలను సరి చేసుకోకుండా వాటిని పొందుకోవాలని గురి కలిగివుంటాము. ఇది ఎలా వుందంటే, విత్తనము వేయకుండా, నీళ్లు పోయకుండా, సాగు చేయకుండా ఫలమును ఆశించినట్లుంది. మన స్వభావము యెక్క పునాది ఆయనలో సరిచేయబడకుండా వున్నట్లు అయితే మనము నిర్మించుకున్న ఏదీ తుఫానుకు నిలువలేదు. బాధాకరము ఎంటంటే మనము ఎప్పుడూ కట్టడము పై గురి కలిగి వుంటాము కానీ పునాదిని మర్చిపోతుంటాము. సామెతలు 4:23 చెబుతుంది- మన హృదయ స్థితి యెక్క ఫలితమే మన జీవిత పరిస్థుతులు కనుక మనము విడుదలకై ప్రార్ధించిన ప్రతీసారి దేవుడు మన స్వభావ పరిపక్వతను సమాధానముగా చెబుతుంటారు. కనుక క్రైస్థవ స్వభావము సమస్యలను పరిష్కరించాలనే ప్రయాసకు బదులు తమ స్వంత సూత్రముల పై ద్యాస కలిగి వుండ వలెను.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత రెవరెండ్ ఇమ్మానువేల్ అరుల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ. నవంబర్. 2025, తర్జుమ: సహోదరి.జలజాక్షి.)

ప్రకటనలు:

1. మీ శిష్యత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే మా వారాంతపు శిష్యత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం – ప్రతి శనివారం జరుగును. ఉదయం 6 గంటలకు. Zoom Link: https://us06web.zoom.us/j/81144235750? pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3EvQT09.(meeting id:81144235750.passcode:12345)

2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము ఆశిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మా సమా చారములకై  https://chat.whatsapp.com/FQuH58GtkEEApPCm9gN8no

వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు :https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment.

Click Here to Download as PDF-> Telugu

Read More →

అనుదిన ధ్యానము : విమోచన కొరకు ఆత్మ యొక్క స్వస్థత.

లేఖన ద్యానము: కీర్తనలు 41:4.

మన జీవితములో అనేక సార్లు అర్థంకాని పరిస్థితులు, ఏం చేయాలో తెలియని సమయాలు, ఎలా అధిగమించాలో తెలియని పరిస్థితులను ఎదుర్కుంటాము. మనం ప్రతీ విషయాన్ని ఎలా ముగించాలి, ఎలా పరిష్కరించాలి మరియు తరువాత దిసకు ఎలా చేరాలి అని ముందుకు వెలుతుంటాము. తమకు ఎదురయ్యే ప్రతి స్థితికి జవాబులు వెతికే రీతిలో మనుషులు రూపింపబడ్డారు. అది చిన్న విషయాలు : వంట, ఉద్యోగం, చదువు, ఇంటి సామాన్లు కొనడం వంటివి లేక ప్రాముఖ్యమైనవి వివాహ సంబంధమైనవి, అనారోగ్యం, ఆర్థిక విషయాలు కావచ్చు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ మన ఏకైక ద్యాస దానిని అంచన వేయడం, పరిసీలించడం, జవాబులు వెతకటం, మరియు దానిని పరిష్కరించడం. మనం ఈ ద్యాసతోనే ప్రార్థనలు కూడా చేస్తుంటాం, జవాబులు, విడుదల రావాలని – మనము బాహ్యం సంబంధమైన జవాబులను వెతుకుతుంటాం కాని అది అంతరంగానికి సంబందించిన జవాబు అయితే? మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యెద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యెద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి”. ప్రభువైన దేవుడు మన భారములను మరియు బాధలను మన ఆత్మల తో ఎందుకు అనుసంధానము చేస్తున్నారు? మన ఆత్మ యెక్క విశ్రాంతి మన బాహ్య సమస్యలకు ఏలాగున జవాబు?

ఆత్మ అంటే ఏంటి? ఆధ్యాత్మిక నియమముతో మనుషులు రూపింపబడుట, లేక ఆధ్యాత్మికత, లేక నైతిక ప్రభావము, లేక మమషుల యొక్క నైతిక మరియు భావోద్వేగ స్వభావము మనలో రూపింపబడిన ఆధ్యాత్మిక, నైతిక మరియు భావోద్వేగ నియమములు మన ఆత్మ. ఇది భౌతికం ను మించినది. ఇది శారీరక సంబంధము కానిది మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చేది. అలా అయితే, మనం మన ఆత్మ పట్ల ఎంత వరకు శ్రద్ధ చూపిస్తున్నాం? ఆత్మ మన ప్రేమకు, ఆశలకు, బావోద్వేగమునకు, వాంచకు, నైతిక, నియమాలకు, వైఖరికి, స్వభావమునకు ఆసనమైయున్నది. మన ఆత్మ-అయితే దేవునితో సంబంధం కలిగి వుంటుంది లేక దేవునికి వ్యతిరేకముగా వుంటుంది.

మన పాపములు మన ఆత్మలో ఉద్భవిస్తాయి. మన ఆత్మ మన స్వభావము. స్వభావము అనగా- వ్యక్తిగత మానసిక మరియు నైతిక లక్షణాలు. దేవుడు మన జీవితాలు ఎంత ఖచ్చితముగా వున్నాయన్నదాని కన్నా మన స్వభావము ఎలా వుందని పర్యవే క్షిస్తుంటారు. తద్వారా మన ఆత్మలకు స్వస్థత కలగాలని ఆయన ఆశిస్తున్నారు. దానినే ఆయన విమోచనగా పరిగణిస్తున్నారు. కీర్తనలు 41:4 “యెహోవా నీ దృష్టి యెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను”. దేవుడు ఉద్దేశపూర్వకముగా ప్రతీ అడ్డంకులను మన జీవితాలలో వుంచుతారు. మన త్రోవలో ఎదుర్కొనే ప్రతీ సవాళ్లకు ఆయనకు ప్రత్యేక చిత్తము కలదు.

మన పరిస్థితులను మన ఆత్మలో గల బలహీనతలను మరియు లోటుపాట్లను తెలియజేస్తారు. మనము అకౌంటెంట్ అవ్వలంటే మనము 12వ తరగతిలో మేత్స మరియు అకౌంట్స్ తీసుకోవాలి. అదే విధముగా, దేవుడు మన స్వభావములో వృద్దిని చూడాలనుకున్నపుడు లేక మన ఆత్మలో ఏదైనా పాపము ను చూపించుటకు మన జీవితములో ఏదో ఒక పరిస్థితిని కలుగ జేస్తారు. మనము ఆయనకు అప్పజెప్పుకొని తర్పీదు పొందుతామన్న ఆశతో. బదులుగా మనం పరిస్థితులను చూచి వాటిని వద్దు అనుకుంటాము, ఎందుకంటే అది దేవునిలో మన స్వభావము రూపింపబడుతుందనే ప్రక్రియ అని చూడకపోవడం వలన. మన ఆత్మ స్వస్థత పొందకుండా మనం దేవునిని ఎలాగు చూస్తాము?

పరివర్తన : నా జీవితములో నా ప్రాముఖ్యత ద్యాస ఏంటి? నేను నా స్వభావమునకు శరీరము కంటే విలువను ఇస్తున్నానా?..’ నా ఆత్మ స్వస్థత కై నేను శ్రమపడుటకు ఇష్టపడుతున్నానా? లేక దాని స్వస్థతను తిరస్కరించి సమస్యలు పోవాలని ఆశిస్తున్నానా?

ప్రార్ధన : మా పరలోకపు తండ్రి, మాకు కనిపించని మా భాగమైన మాఆత్మను బట్టి అజ్ఞానులమై వున్నాము. మేము మా స్వభావము పై ప్రేమ, నైతికత, మానసిక, ఆశలు, భావోద్వేగాలు మరియు వైఖరి పట్ల సరియైన దృష్టిని ఉంచ లేకున్నాము. మా జీవితాలు సజావుగా సాగాలని ఎక్కువ ఆశక్తి కలిగి వున్నాము, అది ఎలాగైనా పొందాలని తాపత్రయ పడుతున్నాము. మా ఆత్మలు మీతో కలవాలన్న మీ ఆశను మేము మర్చిపోయాము. కనుక అది స్వస్థత పొందుకొనవలెను. మీరు మా ఆత్మను స్వస్థపరచని యెడల మేము మీ పిల్లలము కాలేము . మా అంతరంగ స్వస్థత నిర్లక్షించి మేము పాపము చేసి యున్నాము . ప్రభువా మమ్మును క్షమించి, మా ఆత్మ యెక్క స్వస్థత వేడుకొనుటకు అనుదినము కనికరముతో జ్ఞాపకము చేయుము.

సందేశం : మన ఆత్మను సరిచేయుట దేవుని ప్రాముఖ్యత అయి వున్నది. భ్రష్టుపట్టిన ఆత్మ దేవునితో అనుసంధానము కాలేదు. కనుక నిజమైన విమోచన మన ఆత్మీయ స్వస్థతై వున్నది. జీవితములో ప్రతి స్థితికి కారణం దాగి యున్న సమస్య. మనకు ఎప్పుడైనా దుమ్ము విరిగితే వైద్యుని దగ్గరకు వెళ్ళాం కాబట్టి వెంటనే ఆ రోజే స్వస్థత జరిగిపోవాలి అనుకోము. ఆయన వ్రాసిన పరీక్షలు చేయించి, నెలల కొద్ది ఆమన ఇచ్చే వైద్యాన్ని కొనసాగిస్తాము- ఆ విరిగిన దుమ్ము స్వస్థతకై. నొప్పి మరియు వాపు- లోపల దుమ్ము విరిగిందనుటకు సూచనలై వున్నవి. మనము నొప్పికి, వాపుకి వైద్యము చేయము గాని విరిగిన దుమ్ము కి వైద్యం చేస్తాము. అలాగే మన జీవితము లో సమస్యలను పరిష్కరించాలనుకొనే బదులుగా, మనము మన పరమ వైద్యుని దగ్గరకు వెళ్ళి, నిజమైన విమోచనకై మన అంతరంగ స్వభావ స్వస్థత కై మనలను ఆయనకు అప్పజెప్పు కొనవలెను.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత సహోదరి. జసింత ఏంజెల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ. అక్టోబర్. 2025, తర్జుమ: సహోదరి.జలజాక్షి.)

ప్రకటనలు:

1. మీ శిష్యత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే మా వారాంతపు శిష్యత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం – ప్రతి శనివారం జరుగును. ఉదయం 6 గంటలకు.

zoom link:https://us06web.zoom.us/j/81144235750? pwd=RG4veEdLQkJNS1NxYW1ZWmNnb3E vQT09.(meeting id:81144235750.passcode:12345)

2. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము –ఆశిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మా సమా చారములకై  https://chat.whatsapp.com/FQuH58GtkEEApPCm9gN8no వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు :https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment.

Click Here to Download as PDF -> Telugu

Read More →

అనుదిన ఆధ్యాత్మికత: బాధ్యత మరియు కనికరము

లేఖనము : ద్వితీయోపదేశకాండము 21:1-9;లూకా 10:25-37.

దేవుడు గందరగోళ పరిస్థితుల్లో కూడా న్యాయం కొరకు ఎలా ఆలోచిస్తారని ఎప్పుడైనా మీరు ఆలోచించారా?

ద్వితీయోపదేశకాండము 21:1-9 లో తెలియని ఒక శవమును గూర్చి ఒక కథ వున్నది ఒక వ్యక్తి చంపబడి పొలములో దొరికెను, అది ఎవరు చేసారన్నది ఎవరికీ తెలియదు. సమాజము యెక్క

బాధ్యత : చనిపోయిన వారిని గౌరవించుట, నిర్దోషులు నిందింపబడకుండా చూచుకొనుట మరియు దోషులను గుర్తించుట. ఇది కేవలము ఆచారము కాదు. అది దేవుని ద్వారా చెప్పబడినది. “న్యాయము ముఖ్యమైనది, అది సౌకర్యంగా లేనప్పటికీ, ఆ వ్యక్తి తన కొరకు తాను చెప్పుకో లేనప్పటికీ.

కొన్ని సంవత్సరాల తరువాత యేసు క్రీస్తు ఇదే ఆలోచనను మంచి సమరయుడు అను ఉపమానము ద్వారా జీవమునకు తెచ్చెను.

సమరేయుడు ఎవరో వస్తారనో లేక ఆ వ్యక్తి సహయం ఆడుగుతాడనో వేచియుండలేదు. ఆయన అవసరమును చూచి, ముందుకు అడుగు వేసి దైర్యముతోను మరియు కరుణతోను వ్యవహరించెను. యేసు క్రీస్తు తెలియజేయునది ఏమనగా బాధ్యత కేవలం మన స్నేహితుల పట్ల మరియు మనము అర్థము చేసుకొనే ప్రజల పట్లే కాక- అది అపరిచితుల కొరకు, పట్టించుకొనేవారు లేని వారి కొరకు, అణచివేయబడినవారి కొరకు కూడా వుండవలెను.

మరియు ఈ దినాలలో కూడా ఈ పిలుపు అవస్యమై యున్నది. మన చుట్టూ, అన్ని చోట్లా బాధలు వేదనలు వున్నాయి- హింస, అవమానం, పేదరికం, నిర్లక్ష్యం. యేసు క్రీస్తు వాటిని చూస్తున్నారు. ఆయన హృదయం బద్దలవుతోంది. కనుక మనకు వేయబడిన ప్రశ్న : ఆ బాధ్యత స్వీకరించుటకు మనము అంగీకరిస్తున్నామా? మనము ఆయన వేదనను వినగలుగుతున్నామా? మరియు దాని గూర్చి ఏమైనా చేస్తున్నామా? విశ్వాసము అనేది కేవలము మన నమ్మకమును గూర్చి కాదు – అది నైతిక దైర్యము, విచారించుటకు మరియు గుర్తించుటకు అంగీకారము మరియు తమను రక్షించుకోలేని వారి కొరకు వ్యవహరించడము.

నేటి పరివర్తన : మీ జీవితములో ఎవరైనా, లేక సంఘములో, సమాజములో ఎవరైనా బాధలతో వున్నవారు, సహయము అవసరమైన వారు లేక నిర్లక్షింపబడిన వారు వున్నారా? కనికరము తోను మరియు న్యాయముగా వారి కొరకు ఎలాంటి అగుడు నీవు ముందుకు వేయగలవు, కనీసం చిన్న విధానాలలోనైనా?

ప్రార్ధన : మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తున్నాము. మాకు అదృశ్యమైన వాటిని చూచె కన్నులను మరియు అంగీకారముతో ఆచరించే హృదయమును దయచేయుము. న్యాయము మరియు కనికరము ను గూర్చిన మీ వేదనకు స్పందించుటకు మాకు సహయము చేయుము. ఇతరులతో విడిచిపెట్టబడిన చోట అణచివేయబడిన వారికి సహయము చేయుటకు మాకు సహయము చేయుము. రాజులకు రాజైన యేసుక్రీస్తు అద్వితీయ నామములో వేడుకొనుచున్నాము ఆమెన్.

ముగింపు: నిజమైన విశ్వాసము మునలను బాధ్యతలకు మరియు క్రియలకు ప్రేరేపిస్తుంది. ద్వితియోపదేశకాండము లో ఆ తెలియని శవము పట్ల వ్యవహరించిన రీతి మరియు గాయపడిన వ్యక్తి పట్ల సమరయుని సహయము విధముగా నిర్లక్షింపబడినవారి బాధ్యత మనపై వుంది. ప్రతి దినము ఆయన న్యాయము మరియు కనికరము ద్వారా చూచి, వ్యవహరించి, జీవించవలెనని దేవుడు పిలుచుచున్నాడు.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన- రచయిత రెవరెండ్. ఇమ్మానువేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున . ప్రచురణ 18. అక్టోబరు. 2025. తర్జుమ: సహోదరి . జలజాక్షి. అన్ని వాక్యములు ప్రశ్నలు రికవరి వర్షన్ ఆప్ ద బయిబుల్. (లివింగ్ స్టీమ్ మినిస్ట్రీస్)).

ప్రకటనలు :

1. మీ ఈమెయిల్ కు మా ఆధ్యాత్మిక రచనలు క్రమముగా రావాలని ఆశించినట్లు అయితే దయచేసి మా యెక్క ప్రశ్నాపత్రం నింపవలెను. రచనలు ఆంగ్లములో, తమిళములో మరియు తెలుగులో ప్రచురింపబడుచున్నవి. అవి మీ ఈమెయిల్ కు వస్తాయి.

2. మీ శిషత్వపు ప్రయాణములో మా సహకారం ఆశించినట్లు అయితే.. మా వారాంతపు శిషత్వపు సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం. ప్రతి శనివారం జరుగును.link: https://us06web.zoom.us/j/ 81144235750? pwd=EsfuED6du4T8YMjFdSXdpvWuPXpCOW.1 (໖໖ ໑໕: 81144235750. ລ້ລ້: 12345)

3. వ్యక్తిగత కౌన్సెలింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడువుటకు మేము ఆశిస్తున్నాము.

Click here to Download as PDF -> Telugu

Read More →

శీర్షిక:సువార్త వలన కలుగు విస్తారమైన /సమృద్ధియైన సంతోషమును పంచుకొనుట

సువార్త కేవలం సమాచారము కాదు గానీ అది జీవితాన్ని మార్చేది. అది కేవలం భోదించేది గా కాక మనలను విమోచించి, మన ప్రభువును మరియు రక్షకుడైన యేసు క్రీస్తునకు దగ్గర చేసేది.

యెహను 4:28-30 లో సమరయ స్త్రీ గూర్చి ఆలోచిద్దాం, యేసు క్రీస్తును కలిసిన తరువాత ఆమె ఆజ్ఞల కొరకో లేక ఆలోచన కొరకో వేచియుండలేదు. ఆమె అనుభవాన్ని పంచుకొనుటకు పరుగెత్తెను. ఆమె సంతోషము వ్యాప్తించేది! ఈ విధముగా సువార్త పనిచేస్తుంది- అది పంచుకొనవలసినది, మనలో ఉంచుకొనుటకు కాదు.

ఆమె ప్రతిస్పందనను గమనిద్దాం : ఆమె నైపుణ్యతను మరియు ప్రణాళికలను అభివృద్ధి చేసుకొనలేదు/ నేర్చుకో లేదు. ఇతరులను ఒప్పింపజేయుటకు ఆమె చింతించలేదు- అది సృష్టికర్త యెక్క పని, ఆమె సులభముగా ప్రతిస్పందించింది- విశ్వసముపై ఆనుకొనుట.మనము సువార్తను పొందుకున్నప్పుడు అది మనలను రక్షించుటయే కాక మనలను అంతరంగము నుండి బాహ్యమునకు రూపాంతరము కలిగిస్తుంది, మన వ్యక్తిత్వములో క్రీస్తును ప్రతిబింబిస్తుంది.

యేసు క్రీస్తు యెహను 4:14 చెప్పునదేమనగా, విశ్వాసులలో జీవజల ఊటలు ఊరును ఆ జలములు ఉబికి పొంగి పారవలసినవై యున్నవి. ఆ ప్రవాహమును అడ్డుకున్నట్లయితే అది చెడిపోవును, మనకే తిరిగి హాని కలుగును. అది చెడిన నీటి బుగ్గ అవుతుంది, జల ప్రవాహములను ఆపినట్లు అవుతుంది.

లోతును గూర్చి ఆలోచిద్దాం- ఆయన అభ్రహము మీద దేవుని ఆశీర్వాదమును చూచెను కానీ సాదోమోలో మౌనముగా వుండెను. ఆయన మాట్లాడుటలో విఫలమవుట వలన మూల్యముగా ఆయనకు కలిగినదంతా కోల్పోయెన. అదే విధముగా ప్రభువు మనకు అనుగ్రహించినది బిగబట్టిన యెడల దానిని కోల్పోయే ప్రమాదమును ఎంచుకొన్నట్లు.

మత్తయి 25: 14-30 లో దీనిని యేసుక్రీస్తు తేట తెల్లము చేసెను. వారికి ఇవ్వబడినది ఎవరైతే వృద్ధి చేయుదురో వారికి మరి ఎక్కువ ఇవ్వబడును. ఎవరైతే దాచియంచుదురో వారికి కలిగిన కొంచెము కూడా కోల్పోవుదురు. సువార్త లోకమునకు విలువైనదిగా కనిపించకపోవచ్చు కాని అది శక్తివంతమైనది. సమరయ స్త్రీ యెక్క సాక్ష్యము ఇతరులను క్రీస్తునొద్దకు నడిపెను మన సంతోషమును పంచుకొనుట యొక్క విలువకు ఇది నిదర్శనం.

కనుక ఇది మన హృదయమునకు తీసుకుందాం: సువార్తను స్వీకరించి, మనలను అది రూపాంతర పరచనిచ్చి, విశ్వసనీయతతో దానిని ప్రకటిద్దాం. అది మన జీవితములో వృద్ధి పొందునట్లు ప్రభువైన దేవునిని విశ్వసిద్దాం. మీ సంతోషము జీవ జలము వంటిది అది పొంగి పారవలసినదైయున్నది.

పరివర్తన: ఈ రోజు మిమ్మును మీరు ప్రశ్నించుకొనుడి. ప్రభువైన దేవుడు నాకు ఇచ్చిన సంతోషమును మరియు జీవమును వృద్ధి  చెందకుండా నిరోదిస్తున్నాన? ఆయన ప్రేమను ఇతరులకు ప్రచురించుటకు నన్ను ఏది అడ్డుకుంటుంది? కొన్నిసమయాల్లో అది- భయం, స్వీయ సందేహం, లేక నేను ఇంకా సిద్ధంగా లేను అని ఆలోంచించుకోవడం. కాని సమరయ స్త్రీ మనకి గుర్తుచేయునది ఏమనగా చిన్న విశ్వాసము చాలు; మిగిలినది ప్రభువైన దేవుడు చూసుకుంటారు.

ప్రార్ధన : పరలోకపు తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు, మమ్మును బహుగా ఆశీర్వదించినప్పటికీ, తరచుగా స్వార్ధముగా ప్రవర్తిస్తూ నీ రాజ్యమునకు దారితప్పిపోతున్నాము, నా హృదయములో జీవజలములను వుంచినందుకు వందనములు..మీ సువార్త యెక్క సంతోషమును సంకోచించకుండా లేక భయపడకుండా ప్రచురించుటకు సహయము చేయుము. చిన్న సాక్ష్యము కూడా జీవితాలను తాకగలదు, రూపాంతర పరచగలదని విశ్వసించుటకు నేర్పుము,ప్రేమతో మరియు ధైర్యముతో నన్ను నింపుము నా రాజైన రక్షకుడా, మీ ఆశీర్వాదములు నా ద్వారా అనేకులకు ప్రవహించునట్లు సహాయము చేయుము. యేసుక్రీస్తు నామములో, ఆమెన్.

ముగింపు: క్రీస్తును ఎరుగుట అను సంతోషము వెలుపలికి ప్రవహింపవలసినదైయున్నది. ప్రభువైన దేవుడు మీకు అనుగ్రహించినది ప్రచురించుడి – (మీ కథ, మీ ప్రోత్సాహము, మీ ప్రేమ). పరిపూర్ణత లేక అనుమతి కొరకు వేచియుండ వద్దు. మీ హృదయమును పొంగి పొర్లనివ్వండి, దానిని దేవుడు వృద్ధి చేస్తారని విశ్వసించండి.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత, సహోదరి, జలజాక్షి, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ 9 అక్టోబర్. 2025. అన్ని వాక్యములు ప్రశ్నలు రికవరి వర్షన్ ఆప్ ద బియిబుల్ (లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ).

ప్రకటనలు:

1. మీ ఈమెయిల్ కు మా ఆధ్యాత్మిక రచనలు క్రమముగా రావాలని ఆశించినట్లు అయితే, దయచేసి మా యొక్క ప్రశ్నాపత్రం నింపవలెను. రచనలు ఆంగ్లములో, తమిళములో మరియు తెలుగులో ప్రచురింపబడుచున్నవి.అవి మీ ఈమెయిల్ కు వస్తాయి.

2) మీ శిష్యరిక ప్రయాణంలో మా సహకారం ఆశించినట్టు అయితే, మా వారాంతపు శిష్యరిక సమావేశమునకు మీకు మా హృదయపూర్వక ఆహ్వానం. ప్రతి శనివారం జరుగును. link::https://uso6web.zoom.us/j/81144235750?pwd EsfuED6du4T8YMjFdSXdpvWupXpcow.1( meeting id:81144235750.passcode:12345).

3) వ్యక్తిగత కౌన్సిల్ కొరకు మమ్మల్ని సంప్రదించండి.. విశ్వాసములో మరియు సహవాసములో మీతో కూడా నడుచుటకు మేము ఆశిస్తున్నాము.

Click here to download as PDF ->Telugu

Read More →

మతమును మించిన సంబంధము:

మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ కృప మరియు సమాధానము . ఈ అధ్యయనములు మిమ్మును నెమ్మది పరచునట్లు, ప్రతిబింబిచునట్లు మరియు ఆయనకు దగ్గర చేయునట్లు సహయపడవలెనని ప్రార్థిస్తున్నాను.

ఈ రోజులలో అనేకులు క్రైస్తవ్యాన్ని మరొక మతముగా చూస్తున్నారని మీరు ఎరుగుదురు . కాని వాస్తవానికి,అది నియమాలు, అలవాట్లు, దినచర్య మరియు స్వీయ సహయము గూర్చి కాదు గాని, క్రైస్తవ్యం క్రీస్తుతో సంబంధం గూర్చి, మన అంతరంగము సూన్యముగా వున్నప్పుడు మన వెలుపల శుద్ధీకరణకు ఆయన ఆసక్తి చూపరు. ఆయన జీవముతో మనలను నింపుటకు ఆయన ఆసిస్తున్నారు.

యిర్మియా రోజున గూర్చి ఆలోచిద్దాం, హనన్య వంటి

అబద్దపు ప్రవక్తలు ఆశీర్వాదమునకు బాహ్య శ్రేయస్సు ను కొలమానముగా ప్రమానము చేయుదురు. కానీ యిర్మియా, ప్రజలు క్రీస్తు నిజ సంకల్పములోనికి నడిపెను – హృదయములు అంతరంగములో నుండి బాహ్యము నకు రూపాంతరము పొందెను. అది ఇప్పటికీ మనకునూ నిజమై యున్నది. సువార్త మొదట మన పరిస్థితులను సరి చేయుటకు కాదు, అది యేసు క్రీస్తు నిజముగా మనలో ప్రతీ భాగమును పాలించునట్లు మన ఆలోచనలు, కోరికలు మరియు దృష్టిని పునరుద్దీకరించుట గూర్చి

దీనిని గూర్చి యేసు క్రీస్తు హెచ్చరించెను- మత్తయి 12:43-45. “అపవిత్రాత్మ ఒక మనుషుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగు చుండును. విశ్రాంతి దొరకనందున తాను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని వచ్చి, ఆ ఇంట ఎవరును లేక అది ఊడిచి అమర్చియుండుట చూచి, వెళ్ళి తనకంటే చెడ్డ వైన మరి ఏడు దయ్యములను వెంట బెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మెదటి స్థితి కంటె చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించునూ అనెను. హృదయము ఊడిచి సుభ్రపరచి ఖాలీగా వుంచిన యెడల అది శత్రువు ను మరల తిరిగి విశాలముగా తెరచి ఆహ్వానించినట్లు అవుతుంది. అని ఆయన చెప్పెను. మతము కేవలము బాహ్య ఆచారముల వరకే అయితే ఇదే జరుగుతుంది- అది ఇంటిని అలంకరించి రక్షణ లేకుండా వదిలేస్తుంది. కానీ క్రీస్తు ఎప్పుడు లోపలికి వస్తారో అప్పుడు అన్నీ మారుతాయి. ఆయన కేవలము పాతవి తీసివేయుటే కాక మనలను ఆయనతో నింపి మనలను నూతన పరచును. మరియు ఇదియే నిజమైన పశ్చాత్తాపమునకు వివరము. ఇది సులభముగా మనము ఆశించినట్లు శ్రమలు, కష్టాలలో నుండి బయట పడడానికి కాదు గానీ ఇది ప్రభువైన దేవుని స్వారూప్యము లోనికి మనలను పునరుద్దీకరించుటకు మరి ఇది ఏలాగు జరుగును? శిష్యరికము ద్వారా. ఆదిమ శిష్యులు యేసు క్రీస్తుతో ఎలాగు నడిచిరో ఆలాగున మనము కూడా సమయము ద్వారా ఆయన సాన్నిధ్యములో, దైవిక అలవాట్లలో కట్టబడుతూ, ఇతర విశ్వాసులతో
సహవాసము కలిగియుండి, ఆయన వాక్యమును వింటు మరియు ప్రతిదినము అప్పగించుకొనుట నేర్చుకొనుట. ఇది తాత్కాలికము కాదుగానీ, జీవిత కాలము నడువుట కనుక మనము ఆశీర్వాదమును డబ్బుతో, గెలుపుతో లేక సౌకర్యములతో కొలవ వద్దు. నిజమైన ఆశీర్వాదము క్రీస్తు యెక్క గుణాతిశయములు మనలో రూపింపబడుట అది ఈ లోకము ఇవ్వగలిగే దాని కన్నా ఎంతో విలువ కలిగినది.

ఈ రోజు నేను మిమ్మును ప్రోత్సహిస్తున్నాను మీ దగ్గర లేని వాటి కొరకు లేదా మీరు మారాలి అనుకునే వాటి మీద దృష్టి ఉంచకుడి. మీలో సమస్తమును నూతనముగా చేయగల వాని యందు ఆనందించుడి. ఆయనే మీ యెక్క గొప్ప నిధి.

పరివర్తన : నా జీవితములో దేని మీద ఎక్కువ దృష్టి కలిగి వున్నాను? బాహ్య మార్చా లేక అంతరంగ రూపాంతరమా? నేను నిజముగా క్రీస్తుని నన్ను నింపుటకు నన్ను పాలించుటకు అనుమతిస్తున్నానా లేక కేవలము నటిస్తున్నాన.

ప్రార్ధన : నా ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తూ, కేవలము నా బాహ్య శుద్ధీకరణ మాత్రమే కాక, నాలో నివసించుటకు మరియు నూతన పరచుటకు వచ్చినందుకు మీకు వందనములు. నేను బాహ్య లేక ఈ లోకపు విజయములలో ఆశీర్వాదమును వెతకక నాలో నీ జీవము ఎదుగునట్లు నాకు సహయము చేయుము.అనుదినము మీతో నడువుట నాకు నేర్చుము. హృదయము యొక్క ప్రతీ భాగము అప్పగించు కొనుటకు మరియు అన్నింటిని మించి మీ సాన్నిధ్యములో ఆనందించునట్లు సహయుము చేయుము ఆమెన్.

ముగింపు: నిజమైన ఆశీర్వాదము మారిన పరిస్థితులలో లేదు కానీ, అది క్రీస్తు జీవం మీలో దిన దినము రూపింపబడుట లో వున్నది. అది అంతరంగములో నుండి భాహ్యముకు.

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన. రచయిత: రెవరెండ్. ఇమ్మానువేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్ తరుపున, ప్రచురణ 3. అక్టోబర్ 2025, అనువాదము: సహోదరి, జలజాక్షి. అన్ని వాక్యములు ప్రశ్నలు రికవరి వర్షన్ అఫ్ ద బయిబెల్ (లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ).

Read More →

విశ్వసనీయత నైపుణ్యమును మించినది : యిర్మియా 28, 29 నుండి ఒక పరివర్తన.

కొన్ని సమయాలలో మనం మన జీవితాలను చూసి మనం వెనుకబడుతున్నాం అని తలస్తుంటాము ఇతరుల తలాంతులు, అవకాశాలు, గుర్తిపులను బట్టి వారి అభివృద్ధి చూసి అది మనకు లేదు అనుకుంటాము ప్రపంచం అభివృద్ధికి కారణం నైపుణ్యత మరియు కార్యాచరణ అని అంటుంది కాని దేవుడు తరచు దానికి వ్యతిరేకముగా పనిచేస్తారు. ఆయన నైపుణ్యము కన్నా విశ్వసనీయతకు విలువనిస్తారు.

యిర్మియా 28 మరియు 29 ఈ నిజాన్ని విపులంగా విశ్లేపిస్తుంది.. 28వ అధ్యయములో హనన్య దేవుడు బబులోను అధికారాన్ని విచ్చిన్నం చేసి యూదాను పునఃరుద్దీకరిస్తారని నిక్కచ్చిగా ధైర్యముగా చెప్పెను. తన నాటకీయ, ప్రజారంజక సందేశం సులువైన నిరీక్షణనను అందించెను. కాని అది అబద్దం. హనన్య యొక్క ప్రభావశీలత ప్రజలను రెప్పించినప్పటికీ, అది దేవుని నిజ ఉద్దేశము నుండి వైదొలిగించెను.

దీనికి వ్యతిరేకముగా, యిర్మియా కష్టతరమైన నిజమును పలికెను. 27 వ అధ్యాయముతో ప్రవాసులను బబులోనులో స్థిరపడుటకు, జీవితములను కట్టుకొనుటకు మరియు ప్రశాంతమైన ప్రాంతముగా కొరుకొనునట్లు వేడుకొనెను. ఇది ఆడంబరముగా, లేక ప్రజాదరణగా లేనప్పటికీ, ఇది దానియేలు మరియు నెహెమ్యా వంటి నాయకులు ఉద్భవించుటకు, దేవుని చిత్తమునకు విశ్వసనీయమైన పునాదిగా వుండెను.

యిర్మియా దేవుని వాగ్దానమును వారికి జ్ఞాపకము చేసెను. యిర్మియా 21:11- నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హనికరమైనవి కావు.

హనన్య విధేయతలేని ప్రభావశీలత యొక్క ప్రమాదమును మనకు చూపెను. యిర్మియా విశ్వసనీయత యెక్క శక్తిని విపులపరిచెను, అది చూడలేనిదైనప్పటికీ, ప్రాముఖ్యముగా ఎంచబడనప్పటికీ.

దేవుడు విశ్వసనీయతలో ఆనందించును నైపుణ్యమును అభివృద్ధి చేసుకొనవచ్చును, కాని క్రీస్తు మన స్వభావమును చెక్కును, అది మన యోగ్యతను లేక సామర్ధ్యమును మించి నిలిచియుండును.

మీరు నిర్లక్షింపబడినట్లు, నైపుణ్యత లేనట్లు లేక ఈ రోజుకి మీరు సామాన్యులు అని తలిస్తే. మనసుని స్వాధీనపరుచుకొనుడి. దేవుడు మీ విశ్వసనీయ హృదయమును విలువైనదిగా పరిగణిస్తారు. ప్రతివిధమైన విధేయత క్రియ, నమ్మిన సమయము, ప్రేమ యెక్క చిన్ని అడుగులు అవి విత్తనములు, ఆయన వాటిని నిత్యత్వముకు అభివృద్ధి పరచును.

విశ్వసనీయత యెక్క ఎదుగుదల, మన ఇబ్బందులను, సందేహములను క్రీస్తుకు అప్పగించుకొనుటలో ఆరంభమవుతుంది. మీలో విశ్వసనీయత కలుగుటకు ఆయనను అడుగుడి. అది పరిపుర్ణత కొరకు కాదుగాని అది అనుదినము విశ్వసించుటకు, విదేయత చూపుటకు; (ఎవ్వరు చూడని సమయాలలో కూడా), ఈ వినయపూర్వక అప్పగించుకొనుటతో, దేవుడు మీ స్వభావమును పుణరుద్దీకరించును, ఆయన ప్రేమలో స్థిరమైన, లోతైన వేరు కలిగి యుందురు.

కనుక దేవుని కృపను అంగీకరించుడి. ఇతరుల తో పోల్చుకొనుట మాని, మీ యెక్క విలువను లోకపు అందనాలతో అంచనా వేసుకొనక, దేవుడు మీ విశ్వసనీయతలో ఆనందిస్తారని తెలుసుకొనుడి. మీరు విధేయతా తో, విశ్వాసముతో వేసే ప్రతి అడుగు ఆయనకు ఎంతో విలువైనది. ఆయన ఈ విత్తనములను శాశ్వత పంటగా అభివృద్ధి చేయును

(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయితే రెవరెండ్, ఇమ్మాన్యుయేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్, మద్రణ ఆగస్టు 2025, అనువాదం: సహోదరి, జలజాకి.).

Click here to Download as PDF ->Telugu

Read More →

విధానమును విశ్వసించుట : దేవుని వాగ్దానములో లంగరు వేయబడిన ఆలోచనావిధానము.

యేసు క్రీస్తు నామములో వందనములు:

జీవితములో విడుదల పట్ల ద్యాస కలిగి వుండుట సులభతరం కానీ ఈ విధానములో దేవుని మహిమను కోల్పోతాము.

మనము తక్షణ జవాబులు, విడుదల కొరకు కనిపెట్టు కొనుట వలన దేవుడు మన హృదయ అంతరంగాల లోతులలో ఆయన జరిగించు క్రియలను చూడలేని గుడ్డితనము కలుగును.

యిర్మియా 29:11 పలుమార్లు ప్రోత్సహించుటకు చెప్పబడినది కాని దాని అమరికను గుర్తు చేసుకున్నపుడు దాని సముృద్ధి అయిన అర్ధం తెలుస్తుంది.

ఇశ్రాయేలు ప్రజలు గృహములకు దూరముగా, నిరుత్సాహముతో, విడుదలకు అతృత కలిగినవారై బబులోనులో బందీలుగా వుండిరి . ఇద్దరు ప్రవక్తలు

వారితో మాట్లాడిరి : హనన్య తక్షణ విడుదల వాగ్దానము చేసెను, యిర్మియా దేవుని నిజ వాక్కు ను నమ్మకముతో పంచుకొనెను, ఈ ప్రవాసము డెబ్బది సంవత్సరములు వుండును కొద్ది కాలం కాదు అని, హనన్య మాటలు అబద్దపు ఆశలను రేసెను, కాని యిర్మియా సందేశం, వినుటకు కష్టతరమైనప్పటికీ, తన ప్రజలపట్ల దేవుని హృదయమును వెల్లడించెను.

యిర్మియా ద్వారా దేవుడు ప్రకటించెను: నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణ కలుగునట్లగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హనికరమైనవి కావు (యిర్మియా 29:11). వారు వేచియుండుటలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరల ఆయన సాన్నిధ్యములో సంతోపించుటకు, వారి గుర్తింపును కనుగొనుటకు, వారిని స్వస్థత మరియు సిద్ధపాటు కాలము ద్వారా ఆయన సరియైన దిశను చూపెను.
ఇది ప్రవాసమును ఓర్చుకోనుట మాత్రముకాదు- ఇది దేవుని సమయమును గూర్చి నేర్చుకొనుట లేక తెలుసుకొనుట. ఆయనను నమ్ముటకు లేక విశ్వసించుటకు విధేయతకు మించినది అవసరము అది నూతనపరచబడిన ఆలోచనావిదానమై యున్నది. మన భావోద్వేగాలు మారవచ్చు, మన పరిస్థితులు కష్టతరము లేక భారము కావచ్చు మరియు నిరీక్షణ లేనట్టు వుండవచ్చు, కానీ దేవుని వాగ్ధానములు స్థిరముగా వుండును.. వేచియుండుట తృణీకరింపబడినట్లు కాదు గాని, అది దేవుడు పరిస్థితుల వెనుక చేస్తున్న పనిని ఇప్పటికి చూడలేని పరిస్థితి.

మీ పురోగతి వెంటనే కలుగకపోవచ్చు, కానీ అది దేవుని సరియైన సమయములో వస్తుంది. ఆమన వాక్కు వలన మీ హృదయము నూతనపరచబడుట ద్వారా, మీరు ఆయన నిర్ణయించిన భవిష్యత్తు మరియు నిరీక్షణలో నడుచుటకు సన్నద్ధులగుదురు. కాగా మీరు మీ వైపల్యాలను, బలహీనతలను, అసంధవ పరిస్థితులను చూడక, బదులుగా క్రీస్తును చూడుడి. ఆయన రక్తము గొప్ప వాక్కును పలుకును మరియు ఆయన వాగ్దానములు ఎప్పటికీ తప్పవు.

( అనుదిన ఆధ్యాత్మిక పరివర్తని. రచయిల్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ పాల్, మత్తయి 11:28 మినిస్ట్రీస్, ముద్రణ ఆగస్టు 2025 అనువాదం సహోదరి జలజాకి).

Click to download as PDF -> Telugu

Read More →